Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buying Gold: కొనసాగుతున్న‘గోల్డ్ రన్’.. ఈ సమయంలో బంగారం కొనొచ్చా? నిపుణులు ఏం చెప్పారంటే..

మీ పెట్టుబడి లక్ష్యాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం కొనుగోలు మంచి ఆప్షన్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాల కారణంగా బంగారం ధరలు బలంగానే ఉన్నాయి. బంగారం సంప్రదాయకంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితికి వ్యతిరేకంగా రక్షణగా పరిగణిస్తారు.

Buying Gold: కొనసాగుతున్న‘గోల్డ్ రన్’.. ఈ సమయంలో బంగారం కొనొచ్చా? నిపుణులు ఏం చెప్పారంటే..
Gold Rate
Follow us
Madhu

|

Updated on: Oct 15, 2024 | 6:15 PM

గోల్డ్ రన్ కొనసాగుతోంది. రోజురోజుకీ రేటు ఆకాశాన్ని దాటిపోతోంది. బంగారం కొనాలంటేనే ఆందోళన చెందే పరిస్థితిని కల్పిస్తోంది. అయినప్పటికీ దానికి డిమాండ్ తగ్గదు. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఒక్క కుటుంబానికి బంగారంతో అంత అవినావాభావ సంబంధం ఉంటుంది. ఏ శుభకార్యమైనా బంగారం లేకుండా జరగదు. అందుకే నిరంతరం దాని ధరలు పెరుగుతూనే ఉంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ. 78,700కి చేరి ఆల్ టైమ్ హైని అందుకుంది. ఈ ధర దసరాకు ముందు రోజు రూ.78,500 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 600 పెరిగి 10 గ్రాములకు రూ. 78,300గా ఉన్న దాని ఆల్‌టైమ్ హై లెవెల్‌ను తిరిగి పొందింది. అంతకుముందు అక్టోబర్ 7న 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.78,700కి చేరింది. మరో వైపు పారిశ్రామిక డిమాండ్‌తో కిలో వెండి రూ.500 పెరిగి రూ.93,500కి చేరుకుంది. పండుగకు ముందు ముగింపులో కిలో రూ.93,000 వద్ద ముగిసింది. విదేశాల్లో బంగారానికి బలహీనమైన ధోరణి ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్లో బాగా లాభపడింది. అందుకు ప్రధాన కారణం ఆభరణాలకు డిమాండ్ పెరగడమేనని వ్యాపారులు చెబుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ధన త్రయోదశికి బంగారం కొనుగోలు చేయొచ్చు. ఆల్ టైం హై గా ఉన్న సమయంలో బంగరం కొంటే మేలు జరుగుతుందా? తెలుసుకుందాం రండి..

బంగారం కొనుగోలు చేస్తున్నారా?

మీ పెట్టుబడి లక్ష్యాలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం కొనుగోలు మంచి ఆప్షన్ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అంచనాల కారణంగా బంగారం ధరలు బలంగానే ఉన్నాయి. బంగారం సంప్రదాయకంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితికి వ్యతిరేకంగా రక్షణగా పరిగణిస్తారు. ప్రపంచ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగడం, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను సర్దుబాటు చేయడం వంటి చర్యల నుంచి బంగారం మీ పోర్ట్‌ఫోలియోను రక్షించగలగుతుంది. .

పండుగల సమయంలో..

భారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి పండుగ సీజన్లలో బంగారానికి, ముఖ్యంగా ఆభరణాలకు అధిక డిమాండ్ కనిపిస్తుంది. ఈ సీజనల్ స్పైక్ ధరలను పెంచవచ్చు. మీరు దీర్ఘకాలానికి బంగారాన్ని పరిగణనలోకి తీసుకుంటే, శుభ దినాలలో కొనుగోలు చేయడం ఒక వ్యూహాత్మక చర్య కావచ్చు. అయితే ఎల్లప్పుడూ ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షించాలి.. లిక్విడిటీ కోసం డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌ల వంటి ఎంపికలతో విభిన్నతను పరిగణించాలి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అక్షయ తృతీయ నాటికి బంగారం ధర రూ. 84,000చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఆరు నెలల పాటు బంగారం తన రన్ ను కొనసాగిస్తుందని వివరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..