Wealth Tips: పదేళ్ల ప్రభుత్వ బాండ్లను తీసుకోవాలనుకుంటున్నారా? కాస్త ఆగితే మంచిది

2023 వార్షిక బడ్జెట్ లో కీలక ప్రకటన ఉండవచ్చని బాండ్ల పై వడ్డీ పెంపు వంటి ప్రకటనలను ఆశించవచ్చని చెబుతున్నారు. కాబట్టి బాండ్లల్లో పెట్టుబడి పెట్టే ముందు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. 

Wealth Tips: పదేళ్ల ప్రభుత్వ బాండ్లను తీసుకోవాలనుకుంటున్నారా? కాస్త ఆగితే మంచిది
Bonds

Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2022 | 3:32 PM

మీ దగ్గర రిటైర్మెంట్ డబ్బు లేదా ఇతర ఆదాయ మార్గాల సమకూరిన డబ్బును రిస్క్ లేకుండా పదేళ్ల పాటు బాండ్ల రూపంలో దాచుకోవాలనుకుంటున్నారా? ఇలా అయితే కాస్త వేచి చూడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్థిరమైన ఇన్ కమ్ కోసం చాలా మంది బాండ్ల వైపు దృష్టి పెడతారు. కాబట్టి 2023 వార్షిక బడ్జెట్ లో కీలక ప్రకటన ఉండవచ్చని బాండ్ల పై వడ్డీ పెంపు వంటి ప్రకటనలను ఆశించవచ్చని చెబుతున్నారు. కాబట్టి బాండ్లల్లో పెట్టుబడి పెట్టే ముందు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

రెపో రేట్ నేపథ్యంలో బెంచ్ మార్క్ బాండ్ల వడ్డీ మార్చి వరకూ 7.20 శాతం నుంచి 7.40 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. నవంబర్ లో బేస్ పాయింట్లను సడలించిన తర్వాత 7.26 శాతంతో బాండ్ లో పెట్టుబడితో 2032 లో అది మెచ్యూర్ అయ్యే సమయానికి దాని 7.28 శాతమే ఉంది. కాబట్టి నెలలో బాండ్ రాబడి పెద్దగా మారలేదని అర్థమవుతుంది. అయితే బడ్జెట్ ప్రకటన తర్వాత ఈ రేట్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం పెట్టుబడిదారులంతా రెండు, మూడు సంవత్సరాల్లో స్పల్పకాలికంగా మెచ్యూర్ అయ్యే కార్పొరేట్ బాండ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. మార్చి అనంతరం బాండ్లపై వడ్డీ రేట్ ఫైనలయ్యాక అంతా పది సంవత్సరాల ధీర్ఘకాలిక బాండ్ల కొనుగోలుపై దృష్టి పెట్టడం మేలని సూచిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ ను 6.5 శాతానికి తీసుకెళ్లడానికి మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుందని భావిస్తున్నట్లు మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు. బాండ్ మార్కెట్ కు బడ్జెట్ లో ఎలాంటి ప్రతికూల అంశాలు ఉండవని చెబుతున్నారు. పదేళ్ల బాండ్స్ తీసుకోవడానికి 7.40 శాతం వడ్డీ అనేది చాలా మంచి డీల్ అని కాకపోతే డాలర్ తో రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి