Business Idea: రూ. 50,000 పెట్టుబడితో నెలకు రూ. 3లక్షల వరకూ సంపాదన.. సింపుల్ బిజినెస్ ఐడియా..
మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందనుకోండి.. అనేకమంది అతిథులను, బంధువులను స్నేహితులను ఆహ్వానిస్తారు. వారికి అతిథి మర్యాదలు చేసి, ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వెళ్లే సమయంలో గుర్తుగా ఓ బహుమతి ఇస్తుంటారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఈ బహుమతుల తయారీయే ఈ బిజినెస్. దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. ఈ బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఉద్యోగం చేయడం కన్నా ఏదైనా చిన్న వ్యాపారం చేయడమే మంచిదని చాలా మంది భావిస్తున్నారు. అందుకనుగుణంగానే తక్కువ పెట్టుబడులతో చిన్న చిన్న బిజినెస్ లను చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగా విజయవంతం అయిన వారు కూడా ఉన్నారు. మీరు కూడా అటువంటి బిజినెస్ ఐడియా కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. దీనిలో చాలా తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఎంటా బిజినెస్ అనుకుంటున్నారా? ఏమి లేదండి.. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుందనుకోండి.. అనేకమంది అతిథులను, బంధువులను స్నేహితులను ఆహ్వానిస్తారు. వారికి అతిథి మర్యాదలు చేసి, ఆతిథ్యం ఇచ్చిన తర్వాత వెళ్లే సమయంలో గుర్తుగా ఓ బహుమతి ఇస్తుంటారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఈ బహుమతుల తయారీయే ఈ బిజినెస్. దీనిని క్రాఫ్టింగ్ బిజినెస్ అంటారు. దీనికి ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో పర్సనలైజ్డ్ బహుమతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటిని తయారు చేసే బిజినెస్ మీరు ఎన్నుకుంటే మంచి లాభాలు సాధించే అవకాశం ఉంటుంది. అసలు ఆ బిజినెస్ ఏంటి? ఎలా చేయాలి? పెట్టుబడి ఎంత? లాభాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం రండి..
ఇది బిజినెస్..
ఈ బిజినెస్ లో మీరు పర్సనలైజ్డ్ గిఫ్ట్స్ ను అందివ్వొచ్చు. వాటిల్లో ఫోటో ఫ్రేమ్‌ల నుంచి కీ చైన్‌లు, మగ్‌లు, దిండ్లు, బెడ్ షీట్‌లు, పుట్టినరోజు కార్డ్‌లు ఇలా అనేక రకాల ఆప్షన్లు ఇందులో ఉంటాయి. వీటిని తయారు చేసే బిజినెస్ ను మీరు చాలా తక్కువ ధరలో, సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
మార్కెట్ ఎలా ఉంటుంది..
ఈ బిజినెస్ ను ఇంట్లోనే ఉండి సులభంగా చేసుకోవచ్చు. చాలా మంది వ్యాపార వేత్తలు ఈ వ్యాపార నమూనాను చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాగే వారు కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పుట్టినరోజులు, వివాహాలు, నిశ్చితార్థాలు పండుగ సందర్భాలలో ముఖ్యమైన ఆర్డర్‌లను సైతం స్వీకరించే అవకాశం ఈ వ్యాపారంలో ఉంటుంది. కస్టమర్ బడ్జెట్‌లు, డిజైన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండే బహుమతులను సూక్ష్మంగా రూపొందించాల్సి ఉంటుంది.
పెట్టుబడి వివరాలు..
ఈ బిజినెస్ ను ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. కేవలం ఒక యంత్రం, కంప్యూటర్ తో దీనిని ప్రారంభించవచ్చు. అలా ప్రారంభించిన వారు ఇప్పుడు క్రమంగా వారి పరిధిని పెంచుకొని టర్నోవర్ ను సైతం పెంచుకుంటున్నారు.. సాధారణంగా, ప్రారంభ పెట్టుబడి రూ. 50,000 నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది. పని పరిమాణానికి అనుగుణంగా యంత్రాలను పెంచుకునే అవకాశం ఉంది. అంటే మీకొస్తున్న ఆర్డర్లను బట్టి యంత్రాలను పెంచుకోవాల్సి ఉంటుంది.
లాభాలు ఎలా ఉంటాయి..
ఈ బిజినెస్ లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. మీకొస్తున్న ఆర్డర్లను బట్టి మీ లాభాలు మారుతూ ఉంటాయి. చిన్న ఆర్డర్‌లు మోస్తరు లాభాలను అందించినప్పటికీ, పెద్ద ఆర్డర్‌లను తీసుకోవడం ప్రారంభిస్తే మంచి లాభాలు కనిపిస్తాయి. ప్రత్యేకించి వివాహాల వంటి ఈవెంట్‌లను చేస్తే ఎక్కువ లాభాలను చూసే అవకాశం ఉంది. దీనిలో కనీసం రోజుకు రూ. 10,000 సంపాదించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








