AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insurance Policy: పాలసీని కొనుగోలు చేసిన తర్వాత ఈ పొరపాటు చేశారా..? ఒక్క రూపాయి కూడా రాదు..!

Insurance Policy: బీమా పాలసీ ప్రీమియం చెల్లించనందుకు పాలసీని నిలిపివేస్తే , పాలసీ కోసం చేసిన క్లెయిమ్‌ రద్దు చేయవచ్చని సుప్రీం కోర్టు తన ఉత్తర్వుల్లో..

Insurance Policy: పాలసీని కొనుగోలు చేసిన తర్వాత ఈ పొరపాటు చేశారా..? ఒక్క రూపాయి కూడా రాదు..!
Subhash Goud
|

Updated on: Nov 03, 2021 | 5:16 AM

Share

Insurance Policy: బీమా పాలసీ ప్రీమియం చెల్లించనందుకు పాలసీని నిలిపివేస్తే , పాలసీ కోసం చేసిన క్లెయిమ్‌ రద్దు చేయవచ్చని సుప్రీం కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బీమా పాలసీ నిబంధనలను సరిగ్గా వివరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం బీమా కంపెనీలకు సూచించింది. చాలా మంది ప్రజలు పాలసీ నిబంధనలను చూడకుండా, లేదా చదవకుండా పాలసీలు తీసుకుంటున్నారని, తర్వాత క్లెయిమ్‌కు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేసింది. ఈ ఇబ్బందులను నివారించడానికి ఏకైక మార్గం మొదట పాలసీ నిబంధనలు, షరతులను చదవడం, పరిశీలించడం, ఆ తర్వాత మాత్రమే పాలసీని కొనుగోలు చేయాలని అభిప్రాయపడింది.

రోడ్డు ప్రమాద విషయంలో అదనపు పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల కమిషన్‌ ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, బేలా ఎమ్‌ త్రివేదితో కూడిన ధర్మాసనం, బీమా చేసిన వ్యక్తికి పాలసీ నిమమాలపై మంచి విశ్వాసం ఉండాలని న్యాయస్థానం పేర్కొంది.

అసలు విషయం ఏంటంటే.. ఎల్‌ఐసీ నుంచి ఓ వ్యక్తి పాలసీ తీసుకున్నాడు. ఈ బీమా ఎన్‌సీడీఆర్‌సీ నిర్ణయానికి వ్యతిరేకంగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) అప్పీల్‌ను సుప్రీం కోర్టు విచారించి రాష్ట్ర కమిషన్‌ ఉత్తర్వులను రద్దు చేసింది. ఎల్‌ఐసీ నుంచి ఓ వ్యక్తి రూ.3.75 లక్షల బీమా పాలసీ తీసుకున్నాడు. అయితే ప్రమాదవశాత్తు వ్యక్తి మరణిస్తే అదనంగా మరో 3.75 లక్షలను సంస్థ అందజేస్తుంది. ఈ పాలసీ ప్రకారం.. ప్రీమియం ఆరు నెలలకోసారి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ప్రీమియం చెల్లించలేదు. అయితే మార్చి 6వ తేదీ, 2012న రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన మార్చి 21న మృతి చెందాడు. పాలసీ ప్రకారం.. చెల్లించాల్సిన మొత్తాన్ని అంటే 3.75 లక్షలను ఎల్‌ఐసీ చెల్లించేసింది.

ప్రమాదవశాత్తు మరణిస్తే రావాల్సిన మొత్తాన్ని రూ.3.75 లక్షలను ఎల్‌ఐసీ చెల్లించలేదు. దీనిపై మృతుడి భార్య జిల్లాస్థాయి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఫోరం ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ.. మిగతా మొత్తం చెల్లించాలని ఎల్ఐసీ సంస్థను ఆదేశించింది. దీనిపై రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఎల్‌ఐసీ ఆశ్రమించింది. అయితే ఈ తీర్పును ఎస్సీడీఆర్సీ సమర్ధించింది. దీంతో ఎల్‌ఐసీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రమాదం జరిగిన నాటికి పాలసీ అమలులో లేదని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారు తిరిగి పునరుద్ధరించాలని ప్రయత్నించినట్లు గుర్తించింది. దీంతో సంస్థ పాలసీని తిరస్కరించడం సరైనదేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఇవి కూడా  చదవండి:

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరి ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు..!

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!