Bank Deposit: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. కేంద్రం రూ.5 లక్షల పరిమితి పెంచనుందా?
Bank Deposit: ఈ బ్యాంకులు దివాలా తీసినప్పుడు మూడు నెలల్లోపు డిపాజిట్ చేసిన వారి డబ్బును వడ్డీతో సహా రూ.5 లక్షల వరకు తిరిగి ఇస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ సవరణ చట్టాన్ని 2021లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ప్రజల డబ్బు తిరిగి వస్తుందని ఎటువంటి హామీ లేదు..

మీ బ్యాంకు ఖాతాలో ఐదు లక్షల రూపాయల వరకు ఉన్న డబ్బుకు బీమా వర్తిస్తుంది. ఈ బీమా సేవను DICGC అందిస్తోంది. అకస్మాత్తుగా బ్యాంకు వైఫల్యం సంభవించినప్పుడు ఖాతాదారుల డబ్బును రక్షించడంలో ఇది సహాయపడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఈ బీమా మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పుడు రూ.5 లక్షలకు మించి డిపాజిట్ బీమా పరిమితిని పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) RBI కిందకు వస్తుంది. బ్యాంకు దివాలా తీసినప్పుడు చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడే బాధ్యత ఈ సంస్థపై ఉంది. ఇది బ్యాంకులోని కస్టమర్ పొదుపు ఖాతా, ఎఫ్‌డీ, ఆర్డి, కరెంట్ ఖాతాలలో గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. భారతదేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు DICGC బీమా పరిధిలోకి వస్తాయి.
ఈ బ్యాంకులు దివాలా తీసినప్పుడు మూడు నెలల్లోపు డిపాజిట్ చేసిన వారి డబ్బును వడ్డీతో సహా రూ.5 లక్షల వరకు తిరిగి ఇస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ సవరణ చట్టాన్ని 2021లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ప్రజల డబ్బు తిరిగి వస్తుందని ఎటువంటి హామీ లేదు. డిపాజిట్ తిరిగి పొందడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 2021లో సవరణ చేసినప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు డిపాజిట్లను 90 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని నియమం పెట్టారు.
DICGC ఒక్కో ఖాతాకు రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే అదనపు డబ్బుకు హామీ లేదు. బ్యాంకు దివాలా ప్రక్రియ పూర్తయి, డబ్బు అందితే అది డిపాజిటర్లకు బదిలీ చేయబడుతుంది. అయితే అది హామీ ఇవ్వబడలేదు. రూ. 5 లక్షల డిపాజిట్లకు మాత్రమే హామీ ఉంటుంది. అర్హత కలిగిన డిపాజిటర్లు తగిన ధృవీకరణ తర్వాత డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ( DICGC) నుండి తమ డిపాజిట్ల డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాలను రూ. 5 లక్షల వరకు పొందేందుకు అర్హులు. ఫిబ్రవరి 4, 2020 నుండి అమలులోకి వచ్చేలా DICGC డిపాజిటర్లకు బీమా కవర్ పరిమితిని రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఈ డిపాజిట్ పరిమితిని పెంచే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




