AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: బుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. ఏడాదిలో లక్ష దాటనున్న సెన్సెక్స్

మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక, సాంకేతికత, పారిశ్రామిక రంగాలపై సానుకూలంగా ఉందని, ఇతర రంగాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా, ఇటీవలి క్షీణత తర్వాత చిన్న, మధ్యస్థ కంపెనీల స్టాక్‌లు భారీ స్టాక్‌లను అధిగమించవచ్చు అంటూ తెలిపింది.

Stock Market: బుల్ జోష్‌లో స్టాక్ మార్కెట్లు.. ఏడాదిలో లక్ష దాటనున్న సెన్సెక్స్
Stock Market
Venkata Chari
|

Updated on: Dec 07, 2024 | 12:19 PM

Share

Morgan Stanley: వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత స్టాక్ మార్కెట్ 2025లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. తాజాగా అందించిన నివేదిక ప్రకారం, బీఎస్ఈ సెన్సెక్స్ 105,000 వరకు వెళ్లవచ్చని అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ తెలిపింది. ఇందుకు బలమైన ఆదాయాలు, ఆర్థిక స్థిరత్వంతోపాటు దేశీయ పెట్టుబడి కారణంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

మోర్గాన్ స్టాన్లీ ప్రకారం, సెన్సెక్స్ 105,000కి చేరుకునేందుకు 30 శాతం అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 93,000 వరకు వెళ్లవచ్చు అని ఉద్ఘాటించింది. ఇది ప్రస్తుత స్థాయి కంటే 14% ఎక్కువగా ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రిధమ్ దేశాయ్ ప్రకారం, భారతదేశం ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తే, ప్రైవేట్ పెట్టుబడులను పెంచి, వడ్డీ రేట్లు, వృద్ధి మధ్య సమతుల్యతను కొనసాగిస్తే, సెన్సెక్స్ 23x P/E నిష్పత్తిలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇది గత 25 సంవత్సరాల సగటు కంటే 20 రెట్లు ఎక్కువ ఉంది.

ప్రతిదీ సాధారణంగా ఉంటే, సెన్సెక్స్ ఆదాయాలు ప్రతి సంవత్సరం 17% పెరుగుతాయని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఇందుకోసం, ఆర్థిక సంస్కరణలు, స్థిరమైన రిటైల్ పెట్టుబడి, నియంత్రిత స్టాక్ సరఫరా ఉండాలని సూచించింది. దీనితో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, ప్రభుత్వ సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు పెరగడం సెన్సెక్స్‌కు సానుకూల సంకేతాలుగా ఉంటాయని తెలిసింది.

ఇవి కూడా చదవండి

పరిస్థితి మరింత మెరుగుపడితే సెన్సెక్స్ 105,000కు చేరుకోవచ్చు. చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల కంటే తక్కువగా ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నందున ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించడం, ప్రభుత్వం చేసిన సంస్కరణలతో విదేశీ పెట్టుబడులు పెరగడం వంటి కొన్ని మంచి సంకేతాలు ఇందుకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదనంగా, యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, ఉక్రెయిన్-రష్యా సంక్షోభం పరిష్కారం కావడం వంటితోపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఆరోగ్యంగా ఉంటే, భారత మార్కెట్ మరింత లాభపడవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, సెన్సెక్స్ ఆదాయాలు 20% పెరగవచ్చు అని అంచనా వేసింది.

చమురు ధరలు బ్యారెల్‌కు $110 కంటే ఎక్కువ పెరగడం, ఆర్‌బీఐ తన విధానాలను కఠినతరం చేయడం లేదా USలో మాంద్యం వంటి కొన్ని ప్రతికూల సంఘటనలు సంభవిస్తే మాత్రం, సెన్సెక్స్ 70,000కి పడిపోవచ్చు. ఈ పరిస్థితిలో, సెన్సెక్స్ ఆదాయాలు 15% చొప్పున పెరుగుతాయని అంచనా వేసింది.

మోర్గాన్ స్టాన్లీ ఆర్థిక, సాంకేతికత, పారిశ్రామిక రంగాలపై సానుకూలంగా ఉందని, ఇతర రంగాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా, ఇటీవలి క్షీణత తర్వాత చిన్న, మధ్యస్థ కంపెనీల స్టాక్‌లు భారీ స్టాక్‌లను అధిగమించవచ్చు అంటూ తెలిపింది. ఈ సమయంలో, మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు పెట్టుబడిదారులకు మంచి అవకాశాలను ఇవ్వగలవు అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..