AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు వచ్చేస్తుందోచ్.. 8 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే..

Bullet Train: ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే సరికొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలోనే ప్రయాణించే రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు బుల్లెల్‌ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. పనులు వేగవంతమవుతున్నాయి. ఈ బుల్లెట్ రైలు..

Bullet Train: దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు వచ్చేస్తుందోచ్.. 8 గంటల ప్రయాణం కేవలం 2 గంటల్లోనే..
Subhash Goud
|

Updated on: Aug 04, 2025 | 11:32 AM

Share

Bullet Train: దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసు కల త్వరలో నెరవేరబోతోంది. ముంబై – అహ్మదాబాద్ మధ్య అతి త్వరలో హై-స్పీడ్ బుల్లెట్ రైలు నడపడం ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గతంలో ఈ రైలు 8 గంటలు పట్టే దూరాన్ని ఇప్పుడు కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకోనుంది. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, రైలు వేగం గంటకు 320 కిలోమీటర్లుగా ఉంటుందని మంత్రి చెప్పారు. 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ నుండి ప్రారంభమవుతుంది. ఇది వల్సాద్, సూరత్, వడోదర, ఆనంద్ మీదుగా అహ్మదాబాద్‌కు వెళుతుంది. త్వరలో ఈ రైలు పట్టాలెక్కనుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

గుజరాత్‌లో కొత్త రైల్వే ప్రాజెక్టు ప్రారంభం:

ఇవి కూడా చదవండి

భావ్‌నగర్ టెర్మినస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గత 11 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం 34,000 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను వేసిందని, ఇప్పుడు ప్రతిరోజూ దాదాపు 12 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ను నిర్మిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా 1,300 కి పైగా రైల్వే స్టేషన్లను కొత్త రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. గుజరాత్‌లో కూడా, పోర్‌బందర్-రాజ్‌కోట్ కొత్త రైలు సేవ, రూ.135 కోట్ల వ్యయంతో రాన్వావ్ స్టేషన్‌లో కోచ్ నిర్వహణ సౌకర్యం, పోర్‌బందర్ రైల్వే ఫ్లైఓవర్, గతి శక్తి టెర్మినల్స్ వంటి అనేక కొత్త రైల్వే ప్రాజెక్టులపై పనులు జరుగుతున్నాయి.

అమృత్ భారత్ రైళ్లలో వందే భారత్ వంటి సౌకర్యాలు:

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా రైల్వే ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల కారణంగా అభివృద్ధి వేగం పెరిగిందని రైల్వే మంత్రి అన్నారు. ఈ రాష్ట్రాలకు కొత్త రైళ్లను కూడా మంత్రి ప్రకటించారు. నేడు వందే భారత్, అమృత్ భారత్, నమో భారత్ వంటి ఆధునిక రైళ్లు దేశానికి కొత్త గుర్తింపుగా మారాయని ఆయన అన్నారు. అమృత్ భారత్ రైళ్లలో వందే భారత్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి కానీ ఛార్జీలు చౌకగా ఉన్నాయి. ప్రయాణికుల అంచనాలను విన్న తర్వాత తాను కూడా భావోద్వేగానికి గురయ్యానని వైష్ణవ్ అన్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..