Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Real Estate: భారతీయుల చూపు దుబాయ్ వైపు.. ముంబైలో ధరకే దుబాయ్‌లో ఫ్లాట్

భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. అయితే కొంత మంది పెట్టుబడిదారులు కొత్తగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ముంబై ఓ టాప్ ప్లేస్‌లో ఫ్లాట్ కొనే బదులు అదే సొమ్ముతో దుబాయ్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశం ఉండడంతో ఎక్కువ దుబాయ్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు.

Real Estate: భారతీయుల చూపు దుబాయ్ వైపు.. ముంబైలో ధరకే దుబాయ్‌లో ఫ్లాట్
Real Estate In Dubai
Follow us
Srinu

|

Updated on: Mar 12, 2025 | 4:30 PM

భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆస్తి సగటు ధర చదరపు అడుగుకు రూ.26 వేలుగా ఉంది. అయితే దుబాయ్‌లో మాత్రం చదరపు అడుగు రూ.25 వేలకే దొరుకుతుంది. అయితే ముంబైలో స్థూల అద్దె రాబడి 2.75 శాతంగా ఉంటే దుబాయ్‌లో ఇది 7.70 శాతంగా ఉంది. దీంతో పెట్టుబడిదారులు ముంబైలో కంటే దుబాయ్‌లో ఫ్లాట్ కొంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి పొందాలంటే దుబాయ్‌లో రియల్ఎస్టేట్ రంగంలో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒక సాధారణ భారతీయుడు దుబాయ్‌లో ఆస్తిని కొనడం అంత సులభం కాదు. దుబాయ్‌లో ఫ్లాట్ ఎలా కొనవచ్చో? మరియు ఎంత పెట్టుబడి పెడితే ఎంత అద్దె వస్తుందో? వంటి విషయాలను తెలుసుకుందాం. 

దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ నివేదిక ప్రకారం దుబాయ్‌లో ఆస్తి కొనుగోలుదారుల జాబితాలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. దుబాయ్‌పై భారతీయుల ఆసక్తికి అతి పెద్ద కారణం దాని అధిక అద్దె రాబడి. దుబాయ్‌లో సగటు అద్దె రాబడి 7 శాతంగా ఉంది. అలాగే యూఏఈ పన్నురహిత వ్యవస్థ కూడా భారతీయులను ఆకర్షిస్తోంది. నియంత్రిత మార్కెట్ అయినప్పటికీ దుబాయ్ ఇప్పటికీ పన్ను విషయంలో విస్తృత స్వేచ్ఛను అందిస్తుంది. ఇక్కడ వలసదారులు ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.  అయితే దుబాయ్‌లో పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన ఒప్పందం అని డేటా చూపిస్తుంది. కానీ భారతదేశంలో నివసిస్తున్నప్పుడు దుబాయ్‌లో కొనుగోలు చేసిన ఆస్తి నుంచి వచ్చే అద్దెపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదా? అనేది అతిపెద్ద ప్రశ్నగా ఉంటుంది.

దుబాయ్‌లో ఇల్లు కొనడంలో అనేక ముఖ్యమైన చట్టపరమైన, ఆర్థిక అడ్డంకులు ఉన్నాయి. దుబాయ్‌లో ఇల్లు కొనడానికి మీకు ఎలాంటి రుణం లభించదు. అంటే మీరు దుబాయ్‌లో ఇల్లు కొనాలనుకుంటే ఆ మొత్తం మొత్తం ఇప్పటికే మీ ఖాతాలో ఉండాలి. భారతదేశ విదేశీ మారక నిర్వహణ చట్టం (ఎఫ్ఈఎంఏ) విదేశాల్లో రుణం మీద ఆస్తిని సంపాదించడానికి అనుమతించదు. అలాంటి పరిస్థితిలో దుబాయ్‌లో తక్కువ వడ్డీ రేటు గృహ రుణాల ప్రకటనలకు ప్రలోభపడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎఫ్ఈఎంఏ నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా మరియు జైలు శిక్ష విధించవచ్చని కూడా గుర్తుంచుకోవాలి.  ఎఫ్ఈఎంఏ నిబంధనల ప్రకారం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) పరిమితి కూడా ఒక పెద్ద అడ్డంకిగా ఉంది. దీని కారణంగా మధ్యతరగతి జీతం పొందే వ్యక్తి దుబాయ్‌లో రియల్ ఎస్టేట్‌లో రూ. 3 నుంచి రూ.4 కోట్లు పెట్టుబడి పెట్టలేరు. 

ఇవి కూడా చదవండి

ఎల్ఆర్ఎస్ ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా 2,50,000 డాలర్లు అంటే దాదాపు రూ.2.1 కోట్లు విదేశాలకు పంపవచ్చు. దీని కంటే ఎక్కువ డబ్బు పంపడానికి మీరు మరొక కుటుంబ సభ్యుడి ఖాతా ద్వారా డబ్బును బదిలీ చేయాలి లేదా ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఇన్ని నిబంధనలు ఉన్నా దుబాయ్‌లో ఆస్తిలో పెట్టుబడులు పెట్టడంలో భారతీయులు ముందంజలో ఉన్నారు. ఎల్ఆర్ఎస్ నియమాలను దృష్టిలో ఉంచుకుని దుబాయ్‌లోని చాలా మంది బిల్డర్లు ఇప్పుడు వాయిదాలలో భారతీయుల నుండి చెల్లింపులు తీసుకుంటున్నారు. ఇది కూడా ఎఫ్ఈఎంఏ నిబంధనలకు కూడా విరుద్ధం. 

నిబంధనల ప్రకారం, మీరు సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేస్తుంటే ఆ సొమ్ము మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. దీంతో పాటు ఈ మొత్తం రూ. 2.1 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అయితే నిర్మాణంలో ఉన్న భవనాలకు నియమాలు భిన్నంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత చెల్లింపు చేసే సౌకర్యం ఉంది. అలాంటి సందర్భంలో 10 శాతం డౌన్ పేమెంట్ తర్వాత 40 శాతం నిర్మాణ సమయంలో మిగిలిన మొత్తం 1.5 సంవత్సరాల్లో చెల్లించవచ్చు. మిగిలిన మొత్తాన్ని హ్యాండ్ఓవర్ తర్వాత చెల్లించవచ్చు. ఎందుకంటే ఈ వాయిదాలు అరువుగా తీసుకున్న మొత్తాలు కావు. అటువంటి సందర్భంలో నిర్మాణ ఆధారిత చెల్లింపును ఎల్ఆర్ఎస్ పరిమితిలోపు చేయవచ్చు.

ఆదాయపు పన్ను నిబంధనలు

యూఏఈలో ఎలాంటి ఆస్తిపన్ను లేకపోయినా భారతీయులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లలో అద్దె ఆదాయం, విదేశీ ఆస్తుల నుంచి వచ్చే మూలధన లాభాలను నివేదించాలి. ఈ అద్దె ఆదాయం మొత్తం ఆదాయానికి జోడిస్తారు. అలాగే దేశంలో వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..