AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks interest rates: బ్యాంకు రుణాలకు ఇదే మంచి సమయం.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు

ప్రజలకు ఏ విధమైన ఆర్థిక అవసరాలు వచ్చినా మొదటిగా బ్యాంకులకు వెళతారు. వాటి నుంచి రుణాలు తీసుకుని తమ అవసరాలను తీర్చుకుంటారు. అత్యవసర ఖర్చులు, స్థిరాస్తి, ఇల్లు, వాహనాల కొనుగోలు, వ్యాపారం ప్రారంభించడం తదితర వాటి కోసం రుణాలను తీసుకుంటారు. ఇలాంటి రుణగ్రహీతలందరికీ రిజర్వ్ బ్యాంకు ఇండియా (ఆర్ బీఐ) శుభవార్త చెప్పింది.

Banks interest rates: బ్యాంకు రుణాలకు ఇదే మంచి సమయం.. భారీగా తగ్గిన వడ్డీరేట్లు
Bank Interest Rates
Nikhil
|

Updated on: Mar 12, 2025 | 4:45 PM

Share

ఆర్‌బీఐ రెపోరేటు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో అన్ని బ్యాంకులు దాన్ని అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఇప్పటికే రుణాలు తీసుకున్నవారితో పాటు కొత్తగా తీసుకునేవారికీ వడ్డీరేటు తగ్గుతుంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, హౌసింగ్ రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలోని వాణిజ్య బ్యాంకులకు ఆర్ బీఐ రుణాలను మంజూరు చేస్తుంది. వాటికి విధించే వడ్డీరేటునే రెపోరేటు అంటారు. ఈ రేటు పెరిగితే బ్యాంకులు తమ వడ్డీరేటును పెంచుతాయి. రెపోరేటు తగ్గితే వడ్డీరేటు కూడా తగ్గుతుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంకు రెపోరేటును తగ్గించింది. మార్కెట్ లో నగదు ప్రవాహాన్ని నియంత్రణ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

వ్యక్తి గత రుణాలు

  • రెపోరేటు 6.25 శాతానికి వచ్చిన తర్వాత వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు వడ్డీరేటును తగ్గించాయి.
  • పంజాబ్ నేషనల్ బ్యాంకులో సవరించిన వడ్డీరేట్లు ఫిబ్రవరి 12 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకు రూ.20 లక్షల వరకూ వ్యక్తిగత రుణం అందజేస్తోంది. వడ్డీరేటు 11.25 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఖాతాదారులు భౌతికంగా బ్యాంకును సందర్శించకుండానే, పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండానే రుణం పొందవచ్చు.
  • బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రలో ప్రస్తుతం 10 శాతం వడ్డీరేటుకు వ్యక్తిగత రుణాలను అందజేస్తున్నారు.
  • యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఫిబ్రవరి 11 నుంచి కొత్త వడ్డీరేట్లు అమలవుతున్నాయి. కేవలం 11.50 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తున్నారు.
  • సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 12.75 శాతం, హచ్ఎస్బీసీ బ్యాంకులో 10.15 నుంచి 16 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 10.85 నుంచి 21 శాతం వసూలు చేస్తున్నారు.

హౌసింగ్ రుణాలు

  • హౌసింగ్ రుణాల వడ్డీరేటు కూడా తగ్గుదలను చవి చూసింది. రిజర్వ్ బ్యాంకు ఆదేశాలపై ఇప్పటికే కడుతున్న ఈఎంఐల మొత్తం తగ్గుతుంది. లేకపోతే ఈ మొత్తాన్ని అలాగే ఉంచి కాలవ్యవధిని తగ్గిస్తారు. కొత్తగా తీసుకునే వారికి సవరించిన వడ్డీరేట్లపై రుణాలు మంజూరు చేస్తారు.
  • బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర తన హౌసింగ్ రుణాల వడ్డీరేటును 8.10 శాతానికి తగ్గించింది. అలాగే వీటితో పాటు కారు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేసింది.
  • స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా 8.25 శాతం వడ్డీరేటుతో హౌసింగ్ రుణాలను మంజూరు చేస్తుంది.
  • పీఎన్ బీ లో 8.15 శాతం వడ్డీకి హౌసింగ్ రుణాలను మంజూరు చేస్తున్నారు.
  • కెనరా బ్యాంకులో 8.15 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారు.
  • కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐడీఎఫ్ సీ హోమ్ లోన్, యాక్సిస్ బ్యాంకులు సుమారు 8.75 శాతం విధిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలోకి 'లెనిన్'! ఆరోజు నుంచే అఖిల్ సినిమా స్ట్రీమింగ్
ఓటీటీలోకి 'లెనిన్'! ఆరోజు నుంచే అఖిల్ సినిమా స్ట్రీమింగ్
హిట్‌మ్యాన్‌కు జోడీగా బుడ్డోడు.. సరికొత్త ఓపెనర్స్‌తో బరిలోకి..
హిట్‌మ్యాన్‌కు జోడీగా బుడ్డోడు.. సరికొత్త ఓపెనర్స్‌తో బరిలోకి..
ఎరక్కపోయి ఇరుక్కుపోయింది..
ఎరక్కపోయి ఇరుక్కుపోయింది..
నిజమైన ప్రేమకు అర్థం..? జిడ్డు కృష్ణమూర్తి భిన్నమైన నిర్వచనం
నిజమైన ప్రేమకు అర్థం..? జిడ్డు కృష్ణమూర్తి భిన్నమైన నిర్వచనం
ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం..
ఇల్లు లేదా వ్యాపార స్థలం కొనుగోలు చేస్తున్నారా? వాస్తు ప్రకారం..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
NTAలో ఉద్యోగం కావాలా? UPSC ప్రతిభా సేతు నోటిఫికేషన్‌ విడుదల..
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్‌ షాక్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు!
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
కీళ్ల నొప్పులకు మొనగాడు మూలిక.. ఈ చెట్టు గురించి మీకు తెలుసా..?
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!
వరల్డ్ కప్‌లో ఈషా సింగ్‌కు స్వర్ణం, మను భాకర్‌కు కాంస్యం!