Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ విషయంలో తమిళనాడు రైతులకు షాక్.. సొమ్ము జమ కాకుండానే టెక్స్ట్ మెసేజ్‌లు

భారతదేశం ఎన్నో ఏళ్లుగా వ్యవసాయాధిరిత దేశంగా ఉంది. దేశంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దేశంలో ఉన్న రైతులకు సాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభించింది. 2019లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల కింద రూ.6 వేలు సాయం చేస్తుంది.

PM Kisan: పీఎం కిసాన్ విషయంలో తమిళనాడు రైతులకు షాక్.. సొమ్ము జమ కాకుండానే టెక్స్ట్ మెసేజ్‌లు
Pm Kisan
Follow us
Srinu

|

Updated on: Mar 12, 2025 | 4:10 PM

తమిళనాడు రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం నిధులు జమైనట్లు వచ్చిన టెక్స్ట్ మెసేజ్‌లు కలకలం సృష్టించాయి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎలాంటి సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ కాకుండానే జమైనట్లు వచ్చిన టెక్స్ట్ సందేశం తమిళనాడు రైతులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో రైతులు వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకోకుండా చూసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను ప్రారంభించింది. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన ఈ పథకం, దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సంవత్సరానికి రూ. 6,000 కనీస ఆదాయ మద్దతును మూడు విడతలుగా అందిస్తుంది. అయితే ఈ పథకంలో వివిధ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. వాటిని సరిదిద్దడానికి అనేక ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ప్రకారం లబ్ధిదారుల జాబితాను సర్దుబాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2019 తర్వాత రిజిస్టర్ చేసిన డీడీలు రైతు పేరు మీద ఉంటే వాటి ఆధారంగానే సబ్సిడీ పొందవచ్చని ప్రకటించారు. ఫలితంగా తమిళనాడులో రైతుల సంఖ్య భారీగా తగ్గింది.

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఒకటిన్నర లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా కేవలం 72,426 మంది రైతులకు మాత్రమే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 19వ విడత పంటను అందించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అయితే చాలా మంది రైతులకు ఆ మొత్తం అందలేదని ఆరోపణలు ఉన్నాయి. దీని ఆధారంగా రామనాథపురం జిల్లా పరమకుడి పక్కన ఉన్న వాలంగుడి పంచాయతీ పరిధిలోని పులికులం గ్రామానికి చెందిన రైతు దక్షిణామూర్తి సెల్ ఫోన్ కు ఈ ఏడాది 19వ విడత సబ్సిడీ జమ అయిందని మెసేజ్ వచ్చింది. అయితే వెంటనే ఆయన బ్యాంకును సంప్రదించి ఖాతాను తనిఖీ చేస్తే ఎలాంటి సొమ్ము జమ కాలేదని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. 

అనంతరం  తన బ్యాంకు స్టేట్‌మెంట్‌తో స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి విచారించినప్పుడు చివరిసారి ఉపయోగించిన బ్యాంకు ఖాతాలో వాయిదా మొత్తం జమ అవుతుందని చెప్పారు. మీరు మీ ఆధార్ నంబర్‌ను లింక్ చేసిన బ్యాంకుల ఖాతాలను కూడా పరిశీలించమని సూచించారు. తర్వాత ఆయన తన పేరు మీద ఉన్న మరో బ్యాంకు ఖాతాను తనిఖీ చేసినప్పటికీ వాయిదా మొత్తం రాలేదని ఆయన నిర్ధారించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశానని కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా జమ చేసే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజనను ప్రపంచ బ్యాంకుతో సహా వివిధ సంస్థలు ప్రశంసిస్తూ రైతులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని,  పథకం వ్యవసాయ బీమా పరిహార పథకం కంటే మెరుగైనదని చెబుతున్నప్పటికీ, రైతులకు చెల్లించాల్సిన మొత్తానికి బదులుగా టెక్స్ట్ సందేశం మాత్రమే రావడం దిగ్భ్రాంతికరంగా ఉందని నిపుణులు చెబతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..