Market News: ఒడిదుడుకుల్లో ఊగిసలాడుతున్న సూచీలు.. లాభాలతో ప్రారంభమై నష్టాల్లోకి..
Market News: స్వల్ప లాభంతో ప్రారంభమైన భారత స్థాక్ మార్కెట్ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ వారంలో మార్కెట్లు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ సూచీ 120 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ సూచీ 30 పాయింట్లు కోల్పోయింది.
Market News: స్వల్ప లాభంతో ప్రారంభమైన భారత స్థాక్ మార్కెట్ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ వారంలో మార్కెట్లు వరుసగా నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్(Sensex) సూచీ 120 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ(Nifty) సూచీ 30 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ సైతం 120కి పైగా పాయింట్లను ఆరంభంలో కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 120కి పైగా పాయింట్ల లాభంలో ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, పవర్ సెక్టార్ స్టాక్స్ ఎక్కువ ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నాయి. ప్రధానంగా భారతీ ఎయిర్ టెల్ తన స్పెక్టమ్ బకాయిల్లో రూ. 8,815 కోట్లను చెల్లించింది. ఇదే సమయంలో వాహన విడిభాగాల తయారీ సంస్థ మథర్సన్ సుమీ బోయింగ్ విమాన సంస్థ నుంచి భారీ ఆర్డర్ దక్కించుకోవటంతో ఈ కంపెనీల షేర్లు పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి.
టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
నిఫ్టీ సూచీలో బజాజ్ ఆటో1.69%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.43%, భారతీ ఎయిర్ టెల్ 1.01%, స్టేట్ బ్యాంక్ 1.00%, కోటక్ మహీంద్రా 0.94%, డాక్టర్ రెడ్డీస్ 0.87%, టాటా మోటార్స్ 0.76%, అదానీ పోర్ట్స్ 0.66%, ఓఎన్జీసీ 0.56% మేర ఆరంభ లాభంతో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. మారుతీ సుజుకీ 0.84%, లుపిన 0.82%, ఏషియన్ పెయింట్స్ 0.79%, ఐటీసీ 0.73%, పవర్ గ్రిడ్ 0.69%, విప్రో 0.38%, లార్సన్ టర్బో 0.35%, సన్ ఫార్మా 0.31%, హౌసింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ 0.13% మేర ఆరంభంలోనే నష్టాలను నమోదు చేసి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Steel: తాళాలు కొనాలన్నా తల్లడిల్లాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Insurance: టాక్స్ ఆదాకోసం ఇన్సూరెన్స్ చేయడం మంచి పనేనా..? చాలా మంది చేసే తప్పు అదే..