AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధిపై రోజురోజుకీ పెరుగుతోన్న ఆసక్తి.. రూ. లక్ష కోట్లకు చేరుకున్న పెట్టుబడులు.

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వ అందిస్తోన్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి పథకంపై ప్రజల్లో ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ తీసుకొచ్చిన ఈ పథకంపై భారతీయులు ఎక్కువగా...

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధిపై రోజురోజుకీ పెరుగుతోన్న ఆసక్తి.. రూ. లక్ష కోట్లకు చేరుకున్న పెట్టుబడులు.
Sukanya Samriddhi
Narender Vaitla
|

Updated on: Jul 05, 2021 | 7:44 PM

Share

Sukanya Samriddhi Yojana: భారత ప్రభుత్వ అందిస్తోన్న పొదుపు పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి పథకంపై ప్రజల్లో ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. ఆడ పిల్లలున్న తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ తీసుకొచ్చిన ఈ పథకంపై భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన గణాంకాలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. గత ఏడాది కాలంలో ఈ పథకాన్ని తీసుకున్న వారి సంఖ్య ఏకంగా 40 శాతానికి పెరగడం విశేషం. 2020 మే చివరి నాటికి ఈ పథకంలో రూ. 75,522 కోట్ల పెట్టుబడి ఉండగా.. ఈ ఏడాది మే నాటికి ఈ మొత్తం రూ. 1.05 లక్షల కోట్లకు చేరుకుంది. నేషనల్‌ సేవింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించిన గణంకాలు సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇక ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే.. కేవలం ఆడ పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకంలో ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. దీనిలో చేరిన వారు అమ్మాయి పేరుపై ప్రతి నెల కొంత డబ్బు డిపాజిట్‌ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ది స్కీమ్‌లో చేరడం వల్ల అమ్మాయిలకు ఆర్థిక భద్రత లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. ఏడాదిలో కనీసం రూ.250 కూడా చేయవచ్చు. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిటిట్‌ చేయవచ్చు. అకౌంట్‌లో ఎంత డబ్బు జమ చేయాలనేది మీ ఇష్టం. పదేళ్లలోపు ఆడ పిల్లల పేరుపై మాత్రమే ఈ పథకంపై అకౌంట్‌ను తెరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. పోస్టాఫీసు లేదా బ్యాంక్‌కు వెళ్లి మీరు సుకన్య సమృద్ది అకౌంట్‌ తెరుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకం ఇన్వెస్ట్‌ చేసే డబ్బులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది.

Also Read: Ariyana Glory : పిట్ట కొంచం.. కూతఘనం.. అందం అమోఘం.. అరియనా డాన్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

దొంగతనానికి వచ్చిన దొంగ.. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేక.. ఏం ఎత్తుకెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు.!

Honda Cars Price: హోండా కంపెనీ కారు కొనాలనుకుంటున్నారా.? అయితే వెంటనే ఆ పని చేయండి. ఆలస్యం చేస్తే…

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?