Honda Cars Price: హోండా కంపెనీ కారు కొనాలనుకుంటున్నారా.? అయితే వెంటనే ఆ పని చేయండి. ఆలస్యం చేస్తే…
Honda Cars Price: కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అందులోని హోండా కంపెనీ కారునే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే వెంటనే ఆ పని చేసేయండి ఎందుకంటే ఆగస్టు తర్వాత ఆ కంపెనీ కార్ల ధరలు..
Honda Cars Price: కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అందులోని హోండా కంపెనీ కారునే సొంతం చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే వెంటనే ఆ పని చేసేయండి ఎందుకంటే ఆగస్టు తర్వాత ఆ కంపెనీ కార్ల ధరలు పెరగనున్నాయి. పెరిగిన ధరలను ఆగస్టు నుంచి అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ విషయాన్ని హోండా మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేశ్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. హోండా ఈ ఏడాదిలో తమ కంపెనీ కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కార్ల ధరలు పెరగడానికి గల కారణాన్ని వివరించిన రాజేశ్ గోయల్.. ‘కార్ల తయారీకి ఉపయోగించే స్టీల్, అల్యుమినియంతో పాటు విలువైన లోహల ధరలను పెరగడంతో కార్ల ధరలను పెంచడం అనివార్యంగా మారింది. ధరల పెరుగుదలను కొంత మేరైనా తట్టుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయి, వినియోగదారులకు పెరిగిన ధరలను ఎంత మేర బదిలీ చేయాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. మారిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి’ అని తెలిపారు. ఇదిలా ఉంటే హోండా సిటీ, అమేజాన్‌తో పాటు పలు మోడళ్ల కార్లను దేశీయంగా విక్రయిస్తోంది. ఈ ఏడాదిలో హోండా ఇప్పటికే కార్ల ధరలను రెండు సార్లు పెంచింది. ఈ పెరుగుదల కార్ల మోడళ్లను అనుసరించి రూ. 5 వేల నుంచి 20 వేల వరకు ఉంది. అమేజ్, డబ్ల్యూఆర్-వీ మోడళ్లపై కార్ల ధరలు తక్కువగా పెరగగా.. ఫివ్త్ జనరేషన్ సిటీ కారుపై భారీగా పెంచారు. కాబట్టి హోండా కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇదే సరైన సమమయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. Also Read: Super Savings Day: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. యోనో సూపర్ సేవింగ్ డేస్ సేల్.. ఏకంగా 50 శాతం తగ్గింపు!
Savings Scheme: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం..! ( వీడియో )