Hyderabad Vehicle Sales: కరోనా అయితే ఏంటీ.. కార్ల కొనుగోలులో హైదరాబాదీలు ‘తగ్గేదేలే’…!

ఓ వైపు కరోనాతో దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఎన్నడూ చూడని నష్టాలను చవిచూస్తున్నాయి. దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఈ నష్టాలు మరింతగా పెరిగాయి.

Hyderabad Vehicle Sales: కరోనా అయితే ఏంటీ.. కార్ల కొనుగోలులో హైదరాబాదీలు 'తగ్గేదేలే'...!
Vehicle Sales In Pandemic
Follow us

|

Updated on: Jul 05, 2021 | 7:40 PM

Vehicle Sales in Hyderabad: ఓ వైపు కరోనాతో దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఎన్నడూ చూడని నష్టాలను చవిచూస్తున్నాయి. దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించినప్పుడు ఈ నష్టాలు మరింతగా పెరిగాయి. అయితే, ఓ రంగానికి మాత్రం కరోనా ఎఫెక్ట్ తగలలేదు. తాజాగా రవాణా శాఖ విడుదల చేసిన ఫలితాలను చూస్తే… వాహన అమ్మకాలలో తెలంగాణ జోరు కొనసాగిందంట. ఓ వైపు ఎకానమీ పడిపోయినా.. వాహనాల అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయంట. తెలంగాణలో హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాలలోనూ ఈ జోరు కొనసాగినట్లు తెలుస్తోంది. కోవిడ్ పీక్ సమయంలోనూ.. హైదరాబాదీలు మాత్రం వాహనాల కోనుగోలులో తగ్గేదేలే అంటూ.. తమ సత్తా చూపారంట. వీటిలో కార్లను అధికశాతం కొనుగోలు చేశారంట. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేనందువల్ల సొంత వాహనాలను సమకూర్చుకున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ లో సేల్స్ ను గమనిస్తే.. 50,432 టూవీలర్లు, 11,561 ఫోర్ వీలర్లు అమ్ముడైనట్లు సమాచారం. ఫోర్ వీలర్స్ లో కొత్తగా వచ్చిన సీడాన్, హ్యాచ్ బ్యాక్స్ లాంటి మోడల్స్ బాగా అమ్ముడయ్యాయంట. అయితే, జూన్ లో దాదాపు 20 రోజులు లాక్ డైన్ అమలులో ఉంది. మరోవైపు 2019-20 సెప్టెంబర్ లో 40,000 టూవీలర్లు, 9,179 ఫోర్ వీలర్ల అమ్మకాలు జరిగాయంట. ఇక 2020- 21 జూన్ లో దాదాపు 8,372 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయని సమచారం.

ఇక 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో జూన్ నెలలో అమ్మకాలను పరిశీలిస్తే.. వరుసగా 11,941, 11,195, 11,670 వాహనాలు అమ్ముడయ్యాయి. 2020-21 ఏప్రిల్ నెలలో అతి తక్కువ అమ్మకాలు జరిగినట్లు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇందులో 213 టూ వీలర్లు ఉండగా, కేవలం 3 ఫోర్ వీలర్లు మాత్రమే అమ్ముడయ్యాయంట. అయితే, ఆ టైంలో సంపూర్ణ లాక్ డౌన్ ఉండడంతో అమ్మకాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, అదే ఏడాది మే నెలలో లాక్ డౌన్ అమలులో ఉన్నా సరే.. వాహనాల అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఈ నెలలో దాదాపు 30,359 టూ వీలర్లు, 2,547 ఫోర్ వీలర్లు అమ్ముడయ్యాయంట.

తెలంగాణ ప్రభుత్వానికి 2021 లో మే, జూన్ నెలల్లో టూ వీలర్ సేల్స్ తో రూ.62 కోట్లు టాక్స్ రూపంలో ఆదాయం లభించింది. అలాగే అదే నెలల్లో ఫోర్ వీలర్ల సేల్స్ తో రూ. 258 కోట్లు టాక్స్ రూపంలో ప్రభుత్వానికి అందాయి. ఇతర వాహనాల సేల్స్ టాక్స్ లో రూ. 337 కోట్లు దక్కగా, ఓవరాల్ గా వాహనాల అమ్మకాల రూపంలో ప్రభుత్వానికి రూ. 657 కోట్లు టాక్స్ రూపంలో అందాయి.

Also Read:

Honda Cars Price: హోండా కంపెనీ కారు కొనాలనుకుంటున్నారా.? అయితే వెంటనే ఆ పని చేయండి. ఆలస్యం చేస్తే…

Super Savings Day: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. యోనో సూపర్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. ఏకంగా 50 శాతం తగ్గింపు!