AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ariyana Glory : పిట్ట కొంచం.. కూతఘనం.. అందం అమోఘం.. అరియనా డాన్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే..

పిట్ట కొంచెం కూత ఘనం... ఇది నార్మల్ సామెత! పిట్ట కొంచెం కూత ఘనం అందం అమోఘం ఇది అరియానా సామెత! అవును ఉండేది పిట్టంత.. కూసేది.. చెవులు చిల్లులు పడేంత.. అందం పొగిడేంత...

Ariyana Glory : పిట్ట కొంచం.. కూతఘనం.. అందం అమోఘం.. అరియనా డాన్స్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే..
Ariyana
Rajeev Rayala
|

Updated on: Jul 05, 2021 | 7:35 PM

Share

Ariyana Glory : పిట్ట కొంచెం కూత ఘనం… ఇది నార్మల్ సామెత! పిట్ట కొంచెం కూత ఘనం అందం అమోఘం ఇది అరియానా సామెత! అవును ఉండేది పిట్టంత.. కూసేది.. చెవులు చిల్లులు పడేంత.. అందం పొగిడేంత… కుర్రకారుకు పిచ్చెక్కించేంత! ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అరియానా… తాజాగా ఓ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు. హాట్ మూవ్స్‌తో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్‌ చేసి అందర్నీ ఫిదా చేస్తున్నారు. కుర్రకారు డాటాను ఖతం అయ్యేలా చేస్తున్నారు.యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అరియానా.. ఆర్జీవీ కమెంట్స్‌తో ఒక్క సారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌ అయిపోయారు.

అంతవరకు పెద్దగా ఎవరికి తెలియని అరియానా… ఆ ఆర్జీవీ కమెంట్స్ తోనే నెట్టింట ట్రెండ్ గా.. ట్రోలర్స్‌ కు మంచి ఫీడ్‌లా కూడా నిలిచారు. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్‌ లోకి ఎంట్రీ ఇచ్చి వన్‌ ఆఫ్ ది స్ట్రాంగ్‌ కంటెస్టంట్‌గా పేరు తెచ్చుకున్నారు అరి బేబీ..! ఇక హౌజ్‌లో తన ముక్కుసూటితనంతో.. వినసొంపు కాని అరుపుతో… ఏడుస్తూ ఇరిటేట్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు అరియానా. ఇక రీసెంట్ గా ఆర్జీవీ బోల్డ్‌ ఇంటర్వ్యూతో వన్‌ ఆఫ్ ది క్రేజీ బ్యూటీగా నెట్టింట మారిపోయారు. ఇక ఈ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. తన హాట్ హాట్ ఫొటోలతో క్రేజీ డాన్స్ లతో హంగామా చేస్తుంది. తాజాగా అరియనా చేసిన డాన్స్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోల పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan and Krish: మామ కోసం అల్లుడి సినిమానే పక్కన పెట్టేశావా..? క్రిష్.. ఇది నిజమేనా..?

రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.

హీరోయిన్ మెహరీన్‌ల,భవ్య ల ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్ అందుకేనా… ఇంస్టాగ్రామ్ నుండి పోస్టులు డిలీట్ :Mehreen Bhavya Bishnoi video.