India Post: ఇప్పుడు పోస్టల్ సేవలు మరింత స్మార్ట్.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ప్రారంభం
India Post: ఒకప్పుడు కేవలం ఉత్తరాలకే పరిమితమైన పోస్టాఫీసులు తర్వాత రకరకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారబోతున్నాయి. కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెడుతూ సులభతరమైన సేవలు ప్రారంభిస్తోంది..

ఇప్పుడు పోస్టాఫీసు సేవలు మరింత వేగవంతం కానున్నాయి. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా రూ.5,800 కోట్ల విలువైన అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీ (APT)ని ప్రారంభించింది. ఈ కొత్త టెక్నాలజీ పార్శిల్స్, లెటర్‌ల రియల్ టైమ్ ట్రాకింగ్‌ను సాధ్యం చేస్తుంది. దీనితో ప్రజలు ఏ బ్యాంకు నుండైనా UPI చెల్లింపులు చేయగలుగుతారు.
ఇది కూడా చదవండి: PM Modi: సామాన్యులకు మోదీ దీపావళి కానుక… అదేంటో తెలుసా..?
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం సోషల్ మీడియాలో ట్విట్ చేశారు. “ఇండియా పోస్ట్ తరపున దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్ పోస్టల్ టెక్నాలజీని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశ డిజిటల్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక అడుగు. రూ. 5,800 కోట్ల పెట్టుబడితో APT ఇండియా పోస్ట్‌ను ప్రపంచ స్థాయి పబ్లిక్ లాజిస్టిక్స్ సంస్థగా మారుస్తుంది.” అని అన్నారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తులంపై భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..
“APT అనేది పూర్తిగా స్వదేశీ వేదిక. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా దార్శనికత నుండి ప్రేరణ పొందింది. కొత్త సాంకేతికత రియల్-టైమ్ నిర్ణయాలు తీసుకోవడాన్ని సులభతరం చేస్తుందని, ఇ-కామర్స్ పరిధి పెరుగుతుందని, ఆటోమేషన్ కార్యాచరణ ఖర్చులను తగ్గిస్తుందని, అలాగే పౌరులు ఎక్కడైనా, ఎప్పుడైనా సేవలను పొందగలరని ఆయన అన్నారు.
School Holidays: భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు!
ఇది కూడా చదవండి: Viral Video: అయ్యో పాపం.. చిన్నారిపై వీధి కుక్కల కృరత్వం.. ఈ వీడియో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




