AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సామాన్యులకు మోదీ దీపావళి కానుక… అదేంటో తెలుసా..?

PM Modi: ఆహార వస్తువులు, మందులు, వైద్య పరికరాలు, స్టేషనరీ, విద్యా ఉత్పత్తులు, టూత్ బ్రష్‌లు, హెయిర్ ఆయిల్ వంటి ముఖ్యమైన వస్తువులు పన్ను రహితంగా ఉంటాయి లేదా 5 శాతం కేటగిరీలోకి వస్తాయి. టీవీలు, ACలు, రిఫ్రిజిరేటర్లు వంటి వస్తువులు 28కి బదులుగా 18 శాతం

PM Modi: సామాన్యులకు మోదీ దీపావళి కానుక... అదేంటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Aug 20, 2025 | 7:21 AM

Share

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఈ దీపావళికి కానుకగా శుభవార్త అందించనున్నారు. ఇది సామాన్యులకు ఎంతో ఉపశమనం కలిగించేది. సామాన్యులకు మేలు కలిగే అంశాలపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గతంలో పండుగ సీజన్‌ వచ్చేసరికి ధరలు పైపైకి చేరుకోగా, ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండబోతోంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా గోధుమలు, శనగ, పప్పులు, వంట నూనెలు వంటి వస్తువులపై ధరల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలకు ఎంతో ఊరట కలుగనుంది. దీపావళికి ముందుగా కొనుగోలు చేసే వారికీ ఇది అదనపు ఆనందంగా మారబోతోంది.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తులంపై భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..

జీఎస్టీ రెండు శ్లాబుల కారణంగా జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం, మందులు, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్ పై జీరో ట్యాక్స్‌ ఉండవచ్చు. చిన్న కార్లు, ఏసీ, టీవీ, ఫ్రిజ్ పై పన్ను రేట్లు తగ్గించవచ్చు. అయితే, పొగాకు, సిగరెట్లు మాత్రం ఖరీదైనవి అవుతాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: School Holidyas: దసరా పండగకు భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా..?

ప్రతిపాదిత GST 2.0 ఫ్రేమ్‌వర్క్ కింద ప్రభుత్వం వస్తువులు, సేవల పన్ను (GST) రెండు స్లాబ్‌లను అంటే 5, 18 శాతంగా ప్రవేశపెడుతుంది. బీమా ప్రీమియంపై GST 18% కు బదులుగా జీరో లేదా 5% కేటగిరీలోకి రావచ్చు. ఇది సాధారణ ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు, బీమా కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఆహార వస్తువులు, మందులు, వైద్య పరికరాలు, స్టేషనరీ, విద్యా ఉత్పత్తులు, టూత్ బ్రష్‌లు, హెయిర్ ఆయిల్ వంటి ముఖ్యమైన వస్తువులు పన్ను రహితంగా ఉంటాయి లేదా 5 శాతం కేటగిరీలోకి వస్తాయి. టీవీలు, ACలు, రిఫ్రిజిరేటర్లు వంటి వస్తువులు 28కి బదులుగా 18 శాతం కేటగిరీలోకి రావచ్చు. ఆటోమొబైల్స్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, ఎరువులు కూడా ప్రత్యేక దృష్టి సారించే రంగాలుగా ప్రభుత్వం గుర్తించింది.

School Holidays: భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు!

చిన్న కార్లపై పన్ను 10% తగ్గుతుంది:

చిన్న పెట్రోల్, డీజిల్ కార్లపై పన్నును ప్రస్తుత 28% నుండి 18% కి తగ్గించవచ్చు. ఇది హైబ్రిడ్ కార్లు, ద్విచక్ర వాహనాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. వాటిపై కూడా పన్ను తగ్గించే ప్రణాళిక ఉంది. దీనివల్ల కార్ల అమ్మకాలు 15 నుండి 20% వరకు పెరుగుతాయి.

అధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్లపై 40% పన్ను:

అధిక ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్లపై ప్రస్తుతం 28% జీఎస్టీ, 22% వరకు అదనపు సుంకం విధించనున్నారు. దీని వలన మొత్తం పన్ను 50%కి చేరుకుంటుంది. ఇది 40%కి తగ్గవచ్చు. పెద్ద కార్లపై మొత్తం పన్నును 43%-50% స్థాయిలో ఉంచడానికి 40% కంటే ఎక్కువ ఏదైనా అదనపు సుంకం విధించాలా వద్దా అనేది పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: అయ్యో పాపం.. చిన్నారిపై వీధి కుక్కల కృరత్వం.. ఈ వీడియో చూస్తేనే గుండె తరుక్కుపోతుంది!

జీఎస్టీ సంస్కరణల లక్ష్యం :

జీఎస్టీ సంస్కరణల లక్ష్యం రిటైల్ ధరలను తగ్గించడం. సిమెంట్ చౌకగా మారవచ్చు. రిటైల్ వస్తువులు, చెప్పులు-బూట్లు కూడా చౌకగా మారే అవకాశం ఉంది.

ట్రాక్టర్లపై 12% కు బదులుగా 5% పన్ను:

బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ట్రాక్టర్లపై ప్రస్తుతం ఉన్న 12% పన్ను 5% స్లాబ్ కిందకు రావచ్చని విశ్వసిస్తోంది. ఎసి 18% పన్ను స్లాబ్ కిందకు రావచ్చు. ఆహార పదార్థాలపై 12% కు బదులుగా 5% పన్ను ఉండవచ్చు.

రెండు శ్లాబుల అమలుతో ఏం జరుగుతుంది?

రెండు శ్లాబుల అమలుతో 12 శాతం శ్లాబులో చేర్చిన 99 శాతం వస్తువులు 5 శాతం కిందకు, మిగిలినవి 18 శాతం శ్లాబులో చేర్చుతారు. 28 శాతం శ్లాబులో చేర్చిన 90 శాతం వస్తువులు, సేవలు 18 శాతం శ్లాబులోకి వస్తాయి. 5-7 వస్తువులు మాత్రమే 40% రేటులో ఉంటాయి. సగటు నెలవారీ GST సేకరణ 2021-22లో రూ.1.51 లక్షల కోట్ల నుండి 2024-25లో రూ.1.84 లక్షల కోట్లకు పెరిగింది.

ఇది కూడా చదవండి: Electric Scooter: అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్‌ 1గా నిలిచిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి