SIM Cards: మొబైల్ యూజర్లకు అలెర్ట్.. 65 లక్షల సిమ్ కార్డులకు నెట్ వర్క్ కట్ .. కేంద్రం కీలక నిర్ణయం
ప్రతిరోజు దేశంలో కొన్ని వేల మంది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతున్నారు. సుమారుగా నాలుగు నుంచి 500 కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్ ద్వారా పేదలు, నిరక్షరాస్యులు ఎక్కువగా డబ్బులు కోల్పోతున్నారు. ఎంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏదో కొత్త రూపంలో దోపిడీలకు పాల్పడుతుంది సైబర్ ముఠా.
ప్రతిరోజు దేశంలో కొన్ని వేల మంది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతున్నారు. సుమారుగా నాలుగు నుంచి 500 కోట్ల రూపాయలు ఈ సైబర్ క్రైమ్ ద్వారా పేదలు, నిరక్షరాస్యులు ఎక్కువగా డబ్బులు కోల్పోతున్నారు. ఎంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏదో కొత్త రూపంలో దోపిడీలకు పాల్పడుతుంది సైబర్ ముఠా. అయితే ఇలా సైబర్ క్రైమ్ లకు పాల్పడుతున్న గ్యాంగులకు సిమ్ కార్డు కీలకం. ఏదో ఒక నెంబర్ నుంచి ఫోన్ చేసి ఏదో కారణం చెప్పి ఓటిపి సంపాదించడం వీళ్ళ పని. ఫిషింగ్, క్లోనింగ్, టాంపరింగ్, కాల్ చీటింగ్, సిమ్ స్వైపింగ్ ఇలా ఏరకంగా సైబర్ నేరాలు చేయాలన్న సిమ్ కార్డు ఉండాల్సిందే. ఇప్పటివరకు సైబర్ క్రైమ్ ను నివారించేందుకు, నిరోధించేందుకు పోలీసులు ప్రభుత్వాలు చాలా రకాలుగా పనిచేశాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోజుకు సైబర్ క్రైమ్ రేట్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. వీటన్నిటికీ కీ రోల్ గా ఉన్న సిమ్ కార్డులను కంట్రోల్ చేస్తే కొంతమేరకు సైబర్ క్రైమ్ తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది.
అయితే 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఫేక్ సిమ్ కార్డులను గుర్తించడం ఎలా అనేది ఇప్పుడు ఛాలెంజ్ గా మారింది. అయితే ఇందుకోసం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ని ఉపయోగించుకుంటుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్. కోవిడ్ వచ్చిన తర్వాత… ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో థంబ్ అటెండెన్స్ స్థానంలో ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ని ప్రవేశపెట్టారు. దీంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి చాలా వరకు ఫేస్ రికగ్నైజేషన్ ఫ్రేమ్ లు లభించాయి. ఇలా అందుబాటులో ఉన్న డేటాతో ప్రాసెస్ చేస్తే 65 లక్షల సిమ్ కార్డులు ఫేక్ అని తేలింది. ఇండియాలో ఉన్న టెలికాం ఆక్ట్ ప్రకారం ఒక ఆధార్ నెంబర్ తో 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. కానీ కొంతమంది వ్యక్తుల పేరుపై వందలు, వేల సిమ్ కార్డులు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమని పరిశోధించినప్పుడు… ఆధార్ ట్యాంపరింగ్, సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఫోటో దిగాల్సి ఉంటుంది. అప్పుడు కొంతమంది తమ ముఖాలను మేకప్ ద్వారా కొన్ని మార్పులు చేసుకొని మోసం చేశారు. సో ఇలాంటివన్నీ కూడా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి. త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్ తో 130 కోట్ల మంది ఫేస్ ఫ్రేమ్స్ ని ప్రాసెస్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. ఇదే జరిగితే ఇండియాలో నేరాలను సగానికి పైగా కంట్రోల్ చేయొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..