AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Charging Station: పెరుగుతున్న ఈవీ స్టేషన్ సెటప్‌లు.. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ దగ్గరలో నయా ఈవీ స్టేషన్

ప్రపంచవ్యాప్తంగా ఈవీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా స్కూటర్లు, బైక్‌లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేయడానికి ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల నేపథ్యంలో నిర్వహణ వ్యయం తగ్గించుకోవడానికి ఈవీ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల సెటప్‌లు కూడా పెరుగుతున్నారు. తాజాగా బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ బెస్కామ్ సెకండ్ లైఫ్ బ్యాటరీలను సోలార్ ఎనర్జీ స్టోర్ చేసుకునేందుకు ఉపయోగిస్తుంది.

EV Charging Station: పెరుగుతున్న ఈవీ స్టేషన్ సెటప్‌లు.. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ దగ్గరలో నయా ఈవీ స్టేషన్
Ev Car Charging
Nikhil
|

Updated on: Aug 25, 2024 | 8:00 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఈవీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా స్కూటర్లు, బైక్‌లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేయడానికి ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల నేపథ్యంలో నిర్వహణ వ్యయం తగ్గించుకోవడానికి ఈవీ బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీ చార్జింగ్ స్టేషన్ల సెటప్‌లు కూడా పెరుగుతున్నారు. తాజాగా బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ బెస్కామ్ సెకండ్ లైఫ్ బ్యాటరీలను సోలార్ ఎనర్జీ స్టోర్ చేసుకునేందుకు ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌కు శక్తినిచ్చే సౌర శక్తిని నిల్వ చేయడంలో ఈ తరహా బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ చార్జింగ్ స్టేషన్స్‌లో ఉపయోగించే సెకండ్ లైఫ్ బ్యాటరీల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

జిజ్, నునమ్ అనే జర్మనీకి చెందిన కంపెనీల సమన్వయంతో దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 1.5 కి.మీ దూరంలో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీలు రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్, బ్యాటరీలలో పెట్టుబడి పెడుతుండగా బెస్కామ్ అవసరమైన అన్ని ఇతర మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ముఖ్యంగా విమానాశ్రయానికి సమీపంలో 220 కేవీ కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టేషన్ ఉంది. ఆ ప్రాంతంలోనే తాజాగా ఈ స్టార్టప్ కంపెనీను ప్రారంభిస్తామని బెస్కామ్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ తాజా ఈవీ స్టేషన్‌లో ఒకేసారి ఇరవై నాలుగు వాహనాలను ఛార్జ్ చేసే సౌకర్యం ఉందని వివరిస్తున్నారు. 

ముఖ్యంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లో రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్ ఉంటుంది. ముఖ్యంగా పగటిపూట ఈవీ స్టేషన్‌కు అవసరమైన పవర్‌ను అందిస్తుంది. రెండు స్టాక్‌ల బ్యాటరీలు (ప్రతి స్టాక్‌లో 18 బ్యాటరీలు) మొత్తం 45 కేవీఏ సామర్థ్యంతో అదనపు సౌరశక్తి నిల్వ చేస్తుంది. ఈ శక్తి ద్వాారా ఎండ లేని సమయాల్లో స్టేషన్‌కు శక్తినివ్వడానికి ఉపయోగిస్తారు.  సౌరశక్తితో నడిచే ఈవీ స్టేషన్లు ఇంతకుముందు ఏర్పాటు చేసినా పవర్‌ను నిల్వ చేయడానికి, స్టేషన్‌కు సరఫరా చేయడానికి సెకండ్ లైఫ్ బ్యాటరీలను ఎప్పుడూ ఉపయోగించలేదు.  మరో 15 నుంచి 20 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.  సుమారు 80 శాతం పని ఇప్పటికే పూర్తయింది. దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల కంటే కర్ణాటకలో అత్యధికంగా (5,765) పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని ఇంధన శాఖ ఇటీవల ప్రకటించింది. వీటిలో 4,462 స్టేషన్లు బెంగళూరు అర్బన్ జిల్లాలో ఉన్నాయి.