Income Tax Rule: ఇంట్లో అధిక మొత్తంలో నగదు ఉంచుకుంటే ఏమవుతుంది? ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెబుతున్నాయి?

సాధాణంగా అందరి ఇళ్లలో కొంత డబ్బు ఉంచుకోవడం సహజం. అయితే ఇంటి ఖర్చులకో.. మరెదానికో కొంత నగదు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సాధారణ నగదుకంటే..

Income Tax Rule: ఇంట్లో అధిక మొత్తంలో నగదు ఉంచుకుంటే ఏమవుతుంది? ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Income Tax Rule
Follow us

|

Updated on: Jan 07, 2023 | 12:38 PM

సాధాణంగా అందరి ఇళ్లలో కొంత డబ్బు ఉంచుకోవడం సహజం. అయితే ఇంటి ఖర్చులకో.. మరెదానికో కొంత నగదు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ సాధారణ నగదుకంటే మించి మీ ఇంట్లో ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఎక్కువ నగదును ఉంచే అలవాటు మీకు ఉంటే ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. వ్యాపారస్తులుగా ఉన్న వారు మరుసటి రోజు బ్యాంకులో డిపాజిట్ చేసినా తరచూ తమ ఇంట్లో కొంత నగదు ఉంచుకోవాల్సి వస్తోంది. అయినా సరే కొందరి దగ్గర చాలా నగదు ఉండి, వాటిని ఇంట్లోనే ఉంచుకు, తర్వాత పట్టుబడుతున్నారు. మీరు అదే చేస్తే ఈ వార్త మీ కోసమే. ఇలా అధిక మొత్తంలో ఇంట్లో డబ్బును దాచుకున్నట్లయితే ఆదాయపు పన్ను నిబంధనలు ఏంటో తెలుసుకోండి.

ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. మీ ఇంట్లో నగదును ఉంచే పరిమితిని ముందుగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రజల ఇళ్లలో భారీగా నగదు జమ అయినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ప్రతిరోజు కోట్లాది రూపాయల నగదు రికవరీ అవుతోంది. ఇటువంటి పరిస్థిఇలో సాధారణ వ్యక్తి తన ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది.

అధికారుల దాడుల్లో నగదు పట్టిబడితే కారణాలు తెలియజేయాలి:

మీరు దర్యాప్తు సంస్థకు పట్టుబడితే మీరు నగదు మూలాన్ని తెలియజేయాలి. మీరు ఆ డబ్బును సరైన మార్గంలో సంపాదించినట్లయితే మీరు దాని పూర్తి పత్రాలను చూపించాలి. అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తున్నట్లు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కారణాన్ని చెప్పలేకపోతే ఈడీ, సీబీఐ వంటి పెద్ద దర్యాప్తు సంస్థలు మీపై చర్యలు తీసుకుంటాయి.

ఇవి కూడా చదవండి

లెక్కల్లో చూపని నగదు పట్టబడి ఎంత జరిమానా ఉంటుంది?

ఇంట్లో లెక్కల్లో చూపని నగదు పట్టుబడితే ఎంత జరిమానా చెల్లించాలి? ఈ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం.. మీరు ఇంట్లో ఉంచిన డబ్బుకు సంబంధించిన కారణాలు చెప్పకపోవడం, అందుకు ఆధారాలను చూపకపోతే మీరు 137 శాతం వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి