RBI: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల డేటా విడుదల చేసిన ఆర్బీఐ.. తగ్గుముఖం పట్టిన ఫిర్యాదులు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. దేశంలో ఏటీఎం, డెబిట్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయని ఆర్బీఐ..

RBI: డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల డేటా విడుదల చేసిన ఆర్బీఐ.. తగ్గుముఖం పట్టిన ఫిర్యాదులు
RBI
Follow us

|

Updated on: Jan 06, 2023 | 6:37 AM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డుకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. దేశంలో ఏటీఎం, డెబిట్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు తగ్గుముఖం పట్టాయని ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో రుణాలు, అడ్వాన్స్‌లకు సంబంధించిన ఫిర్యాదులు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెబిట్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు తగ్గుముఖం పట్టడం వెనుక కారణం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం.. భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో డెబిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో డెబిట్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా తగ్గుముఖం పట్టాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదిక ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏటీఎంలు, డెబిట్ కార్డ్‌లకు సంబంధించి బ్యాంకులకు మొత్తం 41,375 ఫిర్యాదులు అందాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ ఫిర్యాదుల సంఖ్య 67,800. 2020-21 ఆర్థిక సంవత్సరంలో డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన మొత్తం ఫిర్యాదుల సంఖ్య 60,203. అటువంటి పరిస్థితిలో డెబిట్ కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు సంవత్సరానికి 22 శాతం నుండి 15.4 శాతానికి తగ్గడం గమనించవచ్చు.

రుణ సంబంధిత ఫిర్యాదుల పెరుగుదల:

ఇక ఈ ఫిర్యాదుల సంగతి అటుంచితే.. దేశంలో డెబిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య వేగంగా తగ్గుతోందని బ్యాంకులు చెబుతున్నాయి. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం ఏమిటంటే, ఈ రోజుల్లో ప్రజలు తమ ఖాతా నుండి నేరుగా యూపీఐ ద్వారా చెల్లించడమేనట. ఇలాంటి పరిస్థితుల్లో గతంతో పోలిస్తే డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే వారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో, రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రుణాలకు సంబంధించి మొత్తం 16,437 ఫిర్యాదులు నమోదయ్యాయి, ఈ ఆర్థిక సంవత్సరంలో 2021-22లో 24,507కి చేరుకుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంకు ఖాతాదారుల సౌలభ్యం కోసం రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఆర్బీఐ నియంత్రణలో ఉన్న ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. 2022 ఆర్థిక సంవత్సరంలో రుణాలు, అడ్వాన్సులకు సంబంధించి 2,281 ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో, ఎన్‌బీఎఫ్‌సీ అంబుడ్స్‌మన్‌కు మొత్తం 20,439 ఫిర్యాదులు అందాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి