Budget 2023: దేశంలో తొలిసారిగా బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎక్కువ సమయం ప్రసంగించిన మంత్రి ఎవరు? ఎన్నో ఆసక్తికర విషయాలు

ఈనెల 31 నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారను. అయితే బడ్జెట్‌..

Budget 2023: దేశంలో తొలిసారిగా బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎక్కువ సమయం ప్రసంగించిన మంత్రి ఎవరు? ఎన్నో ఆసక్తికర విషయాలు
Budget 2023
Follow us
Subhash Goud

|

Updated on: Jan 06, 2023 | 5:40 AM

ఈనెల 31 నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారను. అయితే బడ్జెట్‌ను తయారు చేయడంలో ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో సమావేశాలు.. ఎన్నో పరిశీలనలు చేసిన తర్వాత బడ్జెట్‌ ఒక రూపానికి వస్తుంది. ఇక నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. అయితే ఈ బడ్జెట్‌కు సంబంధించి ఎన్నో కీలక విషయాలు ఉన్నాయి.

భారతదేశంలో ఈస్ట్-ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్ వరకు 7 ఏప్రిల్, 1860న ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో మొదటి సారిగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో మొదటి బడ్జెట్‌ నవంబర్‌ 26, 1947న సమర్పించడం జరిగింది. ఈ బడ్జెట్‌ను మొదటి ఎఫ్‌ఎం పోస్ట్ పారిశ్రామికవేత్త, కొచ్చిన్ రాష్ట్ర మాజీ దివాన్, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌కు రాజ్యాంగ సలహాదారు, మంత్రి ఆర్కే షణ్ముకం చెట్టి ప్రవేశపెట్టారు.

ఎక్కువగా ప్రసంగం చేసిందేవరు..?

పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా అత్యధికంగా ప్రసంగం చేసిందెవరు..? 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ నిర్మలా సీతారామన్‌ అత్యధిక సమయం ప్రసంగించిన రికార్డు ఉంది. 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ సమయంలో జూలై 2019లో చేసిన 2 గంటల 17 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టారు. దేశ చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఇందిరాగాంధీ అయితే రెండో మహిళ సీతారామన్‌.

ఇవి కూడా చదవండి

సాధారణ బడ్జెట్‌తో రైల్వే బడ్జెట్‌ను విలీనం:

ఇక 1924 నుంచి కొనసాగుతున్న రైల్‌ బడ్జెట్‌ సంప్రదాయాన్ని కూడా 2016లో మోదీ ప్రభుత్వం మార్చేసింది. 2016 సంవత్సరానికి ముందు, సాధారణ బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందు రైలు బడ్జెట్‌ను ప్రత్యేకంగా సమర్పించారు. అయితే 2016లో ఈ సంప్రదాయం మారిపోయింది. ఆ తర్వాత సాధారణ బడ్జెట్‌తో పాటు రైల్వే బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టారు. దేశంలో మొట్టమొదటి రైల్వే బడ్జెట్‌ను 1924లో ప్రవేశపెట్టారు. దేశంలోని చివరి రైల్వే బడ్జెట్‌ను 2015లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమర్పించారు. ఇక 1991 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రసంగంలో మొత్తం 18,650 పదాలు ఉన్నాయి. ఆ తర్వాత 2018లో 18,604 పదాలతో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇక అతి తక్కువ ప్రసంగం చేసిన మంత్రి ఎవరంటే 1977లో ఆర్థిక శాఖ మంత్రి హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ ఉన్నారు.

ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందేవరు..?

మాజీ ప్రధాని మొరార్జీదేశాయ్‌ పేరిట 1962-69 మధ్య కాలంలో ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వారిలో ఉన్నారు. ఆ తర్వాత పి.చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ ఉన్నారు.

బడ్జెట్ ప్రసంగం సమయం ఎప్పుడు మారిందో తెలుసా..?

ఇక బడ్జెట్‌ ప్రసంగం సమయం కూడా మారింది. 1999 వరకు ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5 గంటల వరకు బడ్జెట్‌ ప్రసంగాన్ని సమర్పించడం ఉండేది. కానీ యశ్వంత్‌ సిన్హా దానిని 1999లో ఆ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.

బడ్జెట్‌ ప్రసంగం తేదీని ఎప్పుడు మార్చారో తెలుసా..?

2017 ఫిబ్రవరి 1న అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే 1955 వరకు బడ్జెట్‌ ఇంగ్లీష్‌లో మాత్రమే సమర్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని ఇంగ్లీష్‌, హిందీలోనూ సమర్పించడం ప్రారంభించింది.

మొదటిసారిగా పేపర్‌లెస్‌ బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు..?

మొదటిసారిగా పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం జరిదింది. కరోనా మహమ్మారి కారణంగా 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ పేపర్‌లెస్‌గా సమర్పించడం జరిగింది. కరోనా వైరస్‌ కారణంగా పేపర్‌లెస్‌ బడ్జెట్‌ ఉంటుందని ముందస్తుగానే ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు.

బడ్జెట్ ప్రతులు ఎక్కడ ముద్రిస్తారు..?

1950 సంవత్సరం వరకు బడ్జెట్‌ ముద్రణ రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. కానీ ఆ సంవత్సరంలో బడ్జె్‌ పత్రాలు లీక్‌ అయ్యాయి. దీని కారణం తర్వాత ఢిల్లీలోని మింట్‌ రోడ్‌లోని ప్రెస్‌లో ముద్రించారు. ఆ తర్వాత అంటే 1980లో ఆర్థిక మంత్రిత్వశాఖలోని ప్రభుత్వ ప్రెస్‌లో ముదించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి