Oyo: ఈ ఏడాదిలో ఓయోలో ఎక్కువగా బుకింగ్స్ చేసుకున్న సిటీలు ఇవే.? అగ్ర స్థానంలో ఏపీ పట్టణం కూడా..
హోటల్ బుకింగ్ సేవలను అందించే సంస్థల్లో ఓయో కంపెనీకి భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అత్యధికంగా ప్రజాదారణ పొందిన బుకింగ్ సైట్‌గా ఓయోకు పేరు ఉంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ ఓయో సేవలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు ఆకర్షించే విధంగా డిస్కౌంట్‌లను అందిస్తూ, లగ్జరీ గదులను తక్కువ ధరకే ఆఫర్...
హోటల్ బుకింగ్ సేవలను అందించే సంస్థల్లో ఓయో కంపెనీకి భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అత్యధికంగా ప్రజాదారణ పొందిన బుకింగ్ సైట్‌గా ఓయోకు పేరు ఉంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ ఓయో సేవలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు ఆకర్షించే విధంగా డిస్కౌంట్‌లను అందిస్తూ, లగ్జరీ గదులను తక్కువ ధరకే ఆఫర్ చేస్తుండడమే ఈ సంస్థ సక్సెస్‌కు కారణంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో ఓయో ఈ ఏడాదికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. 2022లో ఓయోలో ఎక్కడ ఎక్కువ మంది ఓయో సేవలను పొందారన్న విషయాలను ఇందులో పొందుపరిచింది.
ఓయో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది చిన్న పట్టణాల్లోనే హోటల్ రూమ్స్ బుకింగ్‌లు ఎక్కువగా జరిగినట్లు తెలిపింది. తెనాలి, హాత్రాస్, ససారామ్, కరైకుడి తదితర పట్టణాల్లో క్రితం ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ బుకింగ్‌లు జరిగినట్లు ఓయో తెలిపింది. ఇక వ్యాపార పర్యటనలకు సంబంధించి బుకింగ్స్‌లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయి. జూన్ 4న అత్యధిక బుకింగ్‌లు ఓయో ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదయ్యాయి.
ఇక భక్తులు ఎక్కువగా బుకింగ్ చేసుకున్న కేంద్రంగా వారణాసి నిలిచింది. తిరుపతి, పూరి, అమృత్‌సర్, హరిద్వార్ బుకింగ్‌ల పరంగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022లో ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతంగా ఉత్తర ప్రదేశ్ నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోని టెక్సాస్ మొదటి స్థానంలో నిలిచింది. యూకే, లండన్, పాలీమౌత్, మిడిల్స్‌బ్రో, లీసెస్టర్, బ్రైటన్ బెస్ట్ హాలీడే గమ్యస్థానాల్లో నిలిచింది. ఈ ఏడాది ప్రయాణికులు సెలవులను, లాంగ్ వీకెండ్స్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నట్లు ఓయో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..