Electric Scooter: తక్కువ ధర.. ఎక్కువ రేంజ్.. మార్కెట్లోకి దూసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
మై ఈవీ స్టోర్ ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఐఎంఈ ర్యాపిడ్. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఒక్కో వేరియంట్ కు ఒక్కో రేంజ్ ఇచ్చారు. సింగిల్ చార్జ్ పై 100కిలోమీటర్లు, 200కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా స్కూటర్లను రూపొందించారు. ఈ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల ఉంటుంది. ఈ ఐఎంఈ ర్యాపిడ్ స్కూటర్ ధర రూ. 99,000 నుంచి రూ. 1.48లక్షల వరకూ ఉంటుంది.
మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు అన్ని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున విద్యుత్ శ్రేణి స్కూటర్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. అయితే జనాలు కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు వచ్చే స్కూటర్లను ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో చవకైన స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మల్టీ బ్రాండ్ ఈ-మొబిలిటీ రిటైల్ స్పేస్ అయిన మై ఈవీ స్టోర్ ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసింది. దాని పేరు ఐఎంఈ ర్యాపిడ్. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఒక్కో వేరియంట్ కు ఒక్కో రేంజ్ ఇచ్చారు. సింగిల్ చార్జ్ పై 100కిలోమీటర్లు, 200కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చేలా స్కూటర్లను రూపొందించారు. ఈ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల ఉంటుంది. ఈ ఐఎంఈ ర్యాపిడ్ స్కూటర్ ధర రూ. 99,000 నుంచి రూ. 1.48లక్షల వరకూ ఉంటుంది. అది వినియోగదారుని అవసరాలు, ప్రాధాన్యాలను బట్టి రేటు మారుతుంటుంది.
ఈ కొత్త ఐఎంఈ ర్యాపిడ్ స్కూటర్ లాంచింగ్ సందర్భంగా మై ఈవీ స్టోర్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గౌడ మాట్లాడుతూ భారతదేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. తమ కంపెనీ తీసుకొచ్చిన ఐఎంఈ ర్యాపిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సాయంతో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు వినియోగదారుడికి సరికొత్త డ్రైవింగ్ అనుభూతినివ్వడం ఖాయమని చెబుతున్నారు. ఈ కొత్త స్కూటర్ మొదటిగా బెంగళూరులో లాంచ్ చేశామని నెమ్మదిగా కర్ణాటక మొత్తం ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. బెంగళూరులో ఫ్రాంఛైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్(ఎఫ్ఓసీఓ) మోడల్ ను లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు గౌడ చెప్పారు. ఆ తర్వాత దేశంలోని 15 నుంచి 20 నగరాలకు తమ ఉత్పత్తని తీసుకొళ్తామని వివరించారు.
ఐఎంఈ ర్యాపిడ్ స్పెసిఫికేషన్లు..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 2000వాట్ల సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. బ్యాటరీ 60వోల్ట్స్-26/52/72ఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మై ఈవీ స్టోర్ అన్ని వారంటీలను ఈ స్కూటర్ పై అందిస్తోంది. బెంగళూరు వ్యాప్తంగా ఉన్న స్కూటర్ సర్వీసింగ్ స్టెషన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.
ఫైనాన్సింగ్ ఆప్షన్లు..
అలాగే స్కూటర్ కొనుగోలు చేయాలనుకొనే వారికి పలు ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా కంపెనీ అందిస్తోంది. అందుకోసం ఫైనాన్షియల్ సంస్థలతో అనుసంధానమై పనిచేస్తోంది. కోటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్ వంటి వాటి ద్వారా లోన్ సదుపాయం కల్పిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..