Loan With Low Interest: ఆ లోన్‌ కావాలంటే నో సిబిల్‌ స్కోర్‌.. నో ఇన్‌కమ్‌ ప్రూఫ్‌.. కానీ అది తప్పనిసరి..!

తక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్న వ్యక్తులకు రుణాలను అందించినా అధిక వడ్డీ రేట్లను విధిస్తున్నాయి. అయితే ఆదాయ ధ్రువీకరణ లేకుండా బ్యాంకు నుంచి రుణం పొందడం అంటే చాలా కష్టమైన పనిగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో గోల్డ్ లోన్‌లు ఎలాంటి కఠినమైన క్రెడిట్ స్కోర్ లేదా ఆదాయ అవసరాలు లేకుండా ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి.

Loan With Low Interest: ఆ లోన్‌ కావాలంటే నో సిబిల్‌ స్కోర్‌.. నో ఇన్‌కమ్‌ ప్రూఫ్‌.. కానీ అది తప్పనిసరి..!
Loans
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 05, 2023 | 9:55 PM

నేటి ప్రపంచంలో పెరిగిన ఖర్చులు అవసరాల నేపథ్యంలో  రుణాలు తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే ఆ రుణం మంజూరు చేసే సమయంలో రుణదాతలు కచ్చితంగా మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయ రుజువును పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ తక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్న వ్యక్తులకు రుణాలను అందించినా అధిక వడ్డీ రేట్లను విధిస్తున్నాయి. అయితే ఆదాయ ధ్రువీకరణ లేకుండా బ్యాంకు నుంచి రుణం పొందడం అంటే చాలా కష్టమైన పనిగా ఉంది. అయితే ఇలాంటి సమయంలో గోల్డ్ లోన్‌లు ఎలాంటి కఠినమైన క్రెడిట్ స్కోర్ లేదా ఆదాయ అవసరాలు లేకుండా ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. తక్షణ లేదా వ్యక్తిగత రుణాలతో పోలిస్తే సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. కాబట్టి గోల్డ్‌ లోన్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

గోల్డ్ లోన్‌లు ఆర్థిక అవసరాలకు అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తాయి, సాధారణంగా గోల్డ్‌ లోన్లు కేవలం ఒకరోజులోనే పొందవచ్చు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రూ. 1.5 కోట్ల వరకు బంగారు రుణాలను అందిస్తాయి. అలాగే నిధుల వినియోగంలో సౌలభ్యాన్ని అందిస్తాయి. ఈ రుణాన్ని పొందేందుకు మీరు మీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాలి. అలాగే బ్యాంకు వాటిని సురక్షితంగా నిల్వ చేస్తుంది. మీ సౌలభ్యం మేరకు రుణాన్ని తిరిగి చెల్లించడం ద్వారా మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి పొందవచ్చు.

గోల్డ్ లోన్ అనేది సిబిల్‌ స్కోర్ లేదా ఆదాయ రుజువు అవసరం లేని సురక్షితమైన రుణ ఎంపిక. మీ విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టడం వల్ల రుణదాతకు సంబంధించిన నష్టాన్ని తగ్గిస్తుంది. తక్కువ క్రెడిట్ తనిఖీలు లేదా ఆదాయ ధ్రువీకరణ అవసరాన్ని తొలగిస్తుంది. గోల్డ్ లోన్‌లు సాధారణంగా 3 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రామాణిక ప్రాసెసింగ్ రుసుము సుమారు 0.5 శాతంతో పాటు మొత్తం లోన్ మొత్తంపై జీఎస్టీను విధిస్తారు.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత రుణాలతో పోలిస్తే బంగారు రుణాలు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. తరచుగా 8 శాతం వార్షిక రేటుతో ప్రారంభమవుతాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 8 శాతం నుంచి 24 శాతం వరకు వడ్డీ రేట్ల వద్ద బంగారు రుణాలను అందిస్తుంది. ఎస్‌బీఐ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.70 నుంచి 9.80 శాతం పరిధిలోకి వస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ గోల్డ్ లోన్‌పై 8.65 నుంచి 9.25 శాతం వార్షిక వడ్డీ రేటుతో బంగారు రుణాలను అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ లోన్ 11 నుంచి 16 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!