AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold investments: వీటిలో పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారమే.. దీర్ఘకాలంలో పక్కా రాబడి

జీవితం సుఖంగా, సంతోషంగా సాగిపోవడానికి ఆర్థిక ప్రణాళికలు చాాలా అవసరం. సంపాదించే ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసి, ఎంతో కొంత పొదుపు చేయాలి. దాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పోగుచేసుకోవచ్చు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితాన్ని గడపాలని చాలామంది కోరుకుంటారు. దీనిలో భాగంగా వివిధ పెట్టుబడి మార్గాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు.

Gold investments: వీటిలో పెట్టుబడి పెడితే భవిష్యత్తు బంగారమే.. దీర్ఘకాలంలో పక్కా రాబడి
Gold And Silver
Nikhil
|

Updated on: Dec 24, 2024 | 3:45 PM

Share

బంగారంపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ధర పెరుగుతూ ఉండడమే దీనికి ప్రధానం కారణం. ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ బంగారాన్ని ఇష్టపడతారు. పండగలు, శుభకార్యాలు, ఇతర ముఖ్యమైన సందర్బాల్లో దీని వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. మన దేశంలో మహిళలకు బంగారం అంటే ఎంతో మక్కువ. దీంతో తయారు చేసిన ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. తాము చేసుకున్న పొదుపులో ఎక్కువ భాగంగా ఈ లోహాన్ని కొనుగోలు చేయడానికే వినియోగిస్తారనడంలో ఎలాంటి సందేహం ఉండదు. అత్యవసర సమయంలో మనల్ని కాపాడే ఆస్తిగా కూడా బంగారాన్ని పరిగణించవచ్చు. స్టాక్ లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్ లు, రియల్ ఎస్టేట్ తదితర వాటిలో పెట్టుబడి కంటే బంగారంపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యుద్దాలతో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో బంగారం కొనడమే అత్యుత్తమని ప్రజలు భావిస్తున్నారు. గత పదేళ్లలో అంటే 2010 నుంచి 2020 మధ్య బంగారం ధర గణనీయంగా పెరిగింది. పది గ్రాములు రూ.18 వేల నుంచి రూ.49 వేలకు చేరింది. ఆ తర్వాత పెరుగుతూనే ఉంది. రిటైరెంట్ కోసం ప్లానింగ్ చేసుకునే వారికి బంగారంపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. దీని కోసం అనేక మార్గాలు ఉన్నాయి. ఈ పెట్టుబడులతో దీర్ఘకాలంలో అధిక రాబడిని పొందవచ్చు.

బంగారం

ఆభరణాలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఉంటే బంగారాన్ని భౌతిక బంగారం అంటారు. వీటిని కొనుగోలు చేయడానికి మన దేశంలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి నెలా డబ్బులను ఇన్వెస్ట్ చేసి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. దీని కోసం వివిధ బంగారం దుకాణాల్లో పలు స్కీములు కూడా అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్

బంగారంపై డబ్బులను ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇవి గోల్డ్ ఈటీఎఫ్ లు, బంగారం మైనింగ్ కంపెనీలు, బంగారానికి సంబంధించిన ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ద్వారా కేవలం రూ.500 కూాడా పెట్టుబడి పెట్టే అవకాాశం ఉంది.

గోల్ట్ ఈటీఎఫ్ లు

గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేటెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇవి డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్ లో వీటి ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. బయట మార్కెట్ లో ఉన్న ధర ప్రకారంగానే వీటి అమ్మకాలు, కొనుగోలు జరుపుకోవచ్చు. వీటిలో పెట్టుబడులు దీర్థకాలంలో అత్యధిక లాభాలను అందిస్తాయి.

సావరిన్ గోల్డ్ బాండ్లు

సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. వీటికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఎస్ జీబీగా పిలిచే వీటిని ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు విడుదల చేస్తుంది. సురక్షితమైన ఆదాయాన్ని కోరుకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి