AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money saving tips: పొదుపు చిట్కాలు పాటిస్తే బోలెడంత డబ్బు మీ సొంతం.. నిపుణులు సూచించే విషయాలు ఏంటంటే..?

పొదుపు అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. దానితోనే మీ ఆర్థిక అభ్యున్నతి ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతినెలా పొదుపు చేసే చిన్నమొత్తమే భవిష్యత్తులో మిమ్మల్ని ఆదుకుంటుంది. పొదుపును మనం అలవాటుగా మార్చుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే చాలామంది తమ జీతాలు తక్కువగా ఉన్నాయని, ఖర్చులు పెరిగిపోవడంతో పొదుపు చేయలేకపోతున్నామని చెబుతారు.

Money saving tips: పొదుపు చిట్కాలు పాటిస్తే బోలెడంత డబ్బు మీ సొంతం.. నిపుణులు సూచించే విషయాలు ఏంటంటే..?
Money
Nikhil
|

Updated on: Sep 26, 2024 | 5:00 PM

Share

పొదుపు అనేది ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. దానితోనే మీ ఆర్థిక అభ్యున్నతి ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతినెలా పొదుపు చేసే చిన్నమొత్తమే భవిష్యత్తులో మిమ్మల్ని ఆదుకుంటుంది. పొదుపును మనం అలవాటుగా మార్చుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే చాలామంది తమ జీతాలు తక్కువగా ఉన్నాయని, ఖర్చులు పెరిగిపోవడంతో పొదుపు చేయలేకపోతున్నామని చెబుతారు. ఆదాయం ఎక్కువగా ఉంటేనే పొదుపు చేయడం సాధ్యమని భావిస్తారు. కానీ ఈ వాదన నిజం కాదు. మీ ఆదాయం తక్కువగా ఉన్నా ఆర్థిక క్రమశిక్షణ ఉంటే మీరు విజయం సాధించినట్టే. మీకు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ డబ్బును ఆదా చేయడం ఎలాగో తెలుసుకుందాం.

ప్రణాళిక

మీరు సంపాదించే డబ్బుతో సంబంధం లేకుండా పొదుపు చేయడానికి ప్రణాళిక వేసుకోవాలి. తక్కువ ఆదాయం వచ్చేవారు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. దాని కోసం ముందుగా పొదుపు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఖర్చులను తగ్గించుకోవడానికి వివిధ మార్గాలను అన్వేషించాలి.

ఖర్చుల తగ్గింపు

ఖర్చులను తగ్గించుకున్నప్పుడే పొదుపు చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకునేందుకు ఆలోచించాలి. కిరాణా, ఇతర సామగ్రి కొనుగోలులో తెలివిగా వ్యవహరించాలి.

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ ఫండ్

అత్యవసర సమయంలో వినియోగించుకోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ కు ప్రతి నెలా కొంత మొత్తం కేటాయించాలి. దానివల్ల ఎమర్జెన్సీ సమయంలో మీకు ఉపయోగంగా ఉంటుంది. అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి రాదు. దానివల్ల మీకు పొదుపు సాధ్యమవుతుంది.

బడ్జెట్ కేటాయింపులు

మీ ఖర్చులను పరిశీలించండి. పొదుపును ఎక్కడ చేయగలతో నిర్దారణ చేసుకోండి. దానికి అనుగుణంగా వ్యవహరించండి.

పొదుపు

మీరు జీతం అందుకున్న వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు పథకాలకు జమ చేసేయండి. రికరింగ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్ తదితర వాటిలో కేటాయింపులు జరపండి. వీటి కోసం ఆటోమెటిక్ బదిలీలను సెటప్ చేసుకోండి.

రుణం

అప్పులు చేయకుండా ఉన్నప్పుడే మీకు పొదుపు చేయడం సాధ్యమవుతుంది. ఉన్న అప్పులను తీర్చడానికి కూడా చర్యలు తీసుకోవాలి.

బీమా పథకాలు

అనుకోని ఆపద వచ్చిన బీమా పథకాలు చాలా ఆదుకుంటాయి. జీవిత బీమా, ఆరోగ్య బీమా తదితర వాటిని తీసుకోవాలి.

ప్రభుత్వ పథకాలు

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. మీకు అర్హత ఉంటే వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..