Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IDBI Bank FD: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈ పథకం గడువు పొడిగించిన బ్యాంక్.. ప్రయోజనాలు ఇవి..

ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ బ్యాంక్) కూడా ఓ మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైలో అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ పేరిట ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. దీనిలో పెట్టుబడి పెట్టేందుకు డెడ్ లైన్ ను సెప్టెంబర్ 30 వరకూ మాత్రమే ఉంచింది. అయితే బ్యాంకు ఈ పథకం డెడ్ లైన్ ను మరో నెల పాటు పొడిగించింది. అంటే అక్టోబర్ 31 వరకూ దీనిలో పెట్టుబడి పెట్టుకోవచ్చన్నమాట.

IDBI Bank FD: ఎఫ్‌డీ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈ పథకం గడువు పొడిగించిన బ్యాంక్.. ప్రయోజనాలు ఇవి..
Fixed Deposit
Follow us
Madhu

|

Updated on: Sep 22, 2023 | 8:00 AM

ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన పెట్టుబడి పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్. ముఖ్యంగా సీనియర్ సిటీజెన్స్ కు అధిక వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలు ఉండటంతో వీటిల్లో ఎక్కువ పెట్టుబడి పెడుతుంటారు. పైగా పెట్టుబడికి కచ్చితమైన రాబడికి భరోసా కూడా ఉంటుంది. అయితే వీటి వడ్డీ రేటు అన్ని చోట్ల ఒకేలా ఉండదు. పోస్ట్ ఆఫీసులో ఒకలా.. బ్యాంకుల్లో మరోలా ఉంటుంది. అలాగే ఆయా బ్యాంకుల్లో మళ్లీ వేరే వడ్డీ రేట్లు ఉంటాయి. ప్రజలు ఎఫ్‌డీ చేయాలనుకుంటే ముందుగా ఆయా బ్యాంకుల్లో ఎంత వడ్డీ ఇస్తున్నారు? అనే విషయాలను వాకబు చేసుకొని అధిక వడ్డీ వచ్చే చోట ఖాతా ప్రారంభించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు వినియోగదారులకు ఆకర్షించేందుకు ప్రత్యేకమైన ఎఫ్‌డీ స్కీమ్ లను ప్రకటించాయి. వాటిల్లో ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ బ్యాంక్) కూడా ఓ మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జూలైలో అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ పేరిట ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించింది. దీనిలో పెట్టుబడి పెట్టేందుకు డెడ్ లైన్ ను సెప్టెంబర్ 30 వరకూ మాత్రమే ఉంచింది. అయితే బ్యాంకు ఈ పథకం డెడ్ లైన్ ను మరో నెల పాటు పొడిగించింది. అంటే అక్టోబర్ 31 వరకూ దీనిలో పెట్టుబడి పెట్టుకోవచ్చన్నమాట. ఈ క్రమంలో అసలు ఈ అమృత్ మహోత్సవం ఎఫ్‌డీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రయోజనాలు ఎలా ఉన్నాయి? ఎన్ని రకాలుగా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐడీబీఐ బ్యాంక్ అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ..

ఐడీబీఐ బ్యాంక్ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక పథకం రెండు టెన్యూర్స్ లో అందుబాటులో ఉంది. ఒకటి 375 రోజుల కాల వ్యవధి, రెండోది 444 రోజుల కాల వ్యవధి. కాగా దీనిలో పెట్టుబడి పెట్టేందుకు సమయం సెప్టెంబర్ 30 ముగుస్తుండగా.. ఫెస్టివ్ ఆఫర్ కింద దీనిని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్నారు. ఈ స్కీమ్ సాధారణ వినియోగదారులతో పాటు ఎన్ఆర్ఈ(నాన్ రెసిడెంట్ ఎక్స్ టర్నల్), ఎన్ఆర్ఓ(నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) వారు కూడా వినియోగించుకోవచ్చు. వీరికి 444 రోజుల స్కీమ్ లో 7.15శాతం వడ్డీ రేటు వస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజెన్స్ కు 375రోజుల స్కీమ్ లో 7.65శాతం వడ్డీ రేటు వస్తుంది. పెట్టుబడిదారులు ముందుగానే విత్ డ్రా లేదా క్లోజ్ చేసుకొనే వెసులుబాటు కూడా బ్యాంక్ అందిస్తుంది.

టెర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లో మార్పు..

ఇటీవల, బ్యాంక్ తన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సవరించింది. సవరించిన రేట్లు సెప్టెంబర్ 15 నుండి అమలులోకి వచ్చాయి. సాధారణ కస్టమర్లకు ఐడీబీఐ బ్యాంక్ ఎఫ్ డీ లపై 3 శాతం నుంచి 6.8 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది, ఇది 7 రోజుల నుంచి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 3.5 శాతం నుంచి 7.3 శాతం వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది ఐడీబీఐ చరిత్ర..

ఐడీబీఐ బ్యాంక్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. బ్యాంక్ స్థాపన 1964లో పార్లమెంటు చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అనుబంధ సంస్థగా జరిగింది. ఐడీబీఐ 1976లో ప్రభుత్వానికి బదిలీ అయ్యింది. ఆ తర్వాత దేశంలోని పరిశ్రమలకు ఫైనాన్సింగ్, వాటిని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాలను చేపడుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..