Electric Scooters: ఒకేసారి ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 200కి.మీ. రేంజ్.. పూర్తి వివరాలు ఇవి..
డైనమో ఎలక్ట్రిక్ కంపెనీ ఏకంగా ఆరు మోడళ్లను ఒకేసారి భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. డైనమో అల్ఫా, స్మైలీ, ఇన్ఫినిటీ, వీఎక్స్1, ఆర్ఎక్స్1, ఆర్ఎక్స్4 పేరిట వీటిని ఆవిష్కరించింది. వీటిల్లో కొన్ని హై స్పీడ్, మరికొన్ని లో స్పీడ్ స్కూటర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లను గతంలో జరిగిన ఇండియా ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది. వీటిల్లో ప్రత్యేకత ఏంటంటే రేంజ్.
ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని అందిపుచ్చుకునందుకు అన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. టాప్ బ్రాండ్ల నుంచి చిన్న చిన్న స్టార్టప్ ల వరకూ తమ ఉత్పత్తులను ఇక్కడ లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో డైనమో ఎలక్ట్రిక్ కంపెనీ ఏకంగా ఆరు మోడళ్లను ఒకేసారి భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. డైనమో అల్ఫా, స్మైలీ, ఇన్ఫినిటీ, వీఎక్స్1, ఆర్ఎక్స్1, ఆర్ఎక్స్4 పేరిట వీటిని ఆవిష్కరించింది. వీటిల్లో కొన్ని హై స్పీడ్, మరికొన్ని లో స్పీడ్ స్కూటర్లు ఉన్నాయి. ఈ స్కూటర్లను గతంలో జరిగిన ఇండియా ఎక్స్ పో 2023లో ప్రదర్శించింది. వీటిల్లో ప్రత్యేకత ఏంటంటే రేంజ్. లో స్పీడ్ స్కూటర్లు సింగిల్ చార్జ్ పై ఏకంగా 200కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని డైనమో ఎలక్ట్రిక్ సగర్వంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో డైనమో కొత్త స్కూటర్లకు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, ఫీచర్లు, రేంజ్ వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
డైనమో ఆర్ఎక్స్1, ఆర్ ఎక్స్4.. ఈ రెండు స్కూటర్లు హై స్పీడ్ స్కూటర్లు. కాగా ఆర్ఎక్స్1 స్కూటర్లో 2 కేడబ్ల్యూ బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 82,000(ఎక్స్ షోరూం) ఉంటుంది. అదే సమయంలో ఆర్ఎక్స్4 స్కూటర్లో 3కేడబ్ల్యూ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ. 99,000(ఎక్స్ షోరూం)నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు స్కూటర్లు గరిష్టంగా గంటకు 65కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతాయి. వీటిల్లో అత్యాధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. బ్లూటూత్ స్పీకర్లు, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి.
డైనమో అల్ఫా, స్మైలీ, ఇన్ఫినిటీ, వీఎక్స్1.. ఈ నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లు లో స్పీడ్ స్కూటర్లు. ఇవి సింగిల్ చార్జ్ పై ఏకంగా 200కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. 2కేడబ్ల్యూ, 2కేడబ్ల్యూ సామర్థ్యాలతో కూడిన స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఈ ఈ-స్కూటర్ల ప్రారంభ ధర రూ. 55,000(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతాయి. ఈ బ్యాటరీ మూడు నాలుగు గంటల్లో ఫుల్ చార్జింగ్ ఎక్కుతుందని డైనామో ప్రకటించింది.
ముంబై, గజియాబాద్ లలో తయారీ.. ప్రస్తుతం డైనమో ఎలక్ట్రిక్ ఈ స్కూటర్లను గజియాబాద్, ముంబైల్లో ఉన్న తయారీ యూనిట్లలో తయారుచేస్తోంది. దేశ వ్యాప్తంగా వీరికి 175కు పైగా డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. వీటిని మరింత విస్తరించేందుకు కంపెనీ ప్రణాళిక చేసింది. అలాగే చార్జింగ్ నెట్ వర్క్ ను కూడా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. తద్వార తమ మార్కెట్ ను మరింత ఎక్కువ చేసుకోవాలని చూస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..