ICICI Bank: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ భద్రంగా ఉండాలంటే ఈ పనులు చేయాలంటున్న ఐసీఐసీఐ..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో ప్రతి చిన్న పని ఇంట్లోనే ఉండి చేసుకునే పరిస్తితులు వచ్చాయి. నిత్యావసర సరుకుల నుంచి ఆర్థిక లావాదేవిల
ICICI BANK: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కాలంలో ప్రతి చిన్న పని ఇంట్లోనే ఉండి చేసుకునే పరిస్తితులు వచ్చాయి. నిత్యావసర సరుకుల నుంచి ఆర్థిక లావాదేవిల వరకు ప్రతి విషయానికి స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ బ్యాంకింగ్ పరంగా ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లావాదేవిలకు అవసరమైన ఖాతా.. సంబంధిత హెచ్చరికలు.. వన్ టైం పాస్వర్డ్ (OTP), ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ (URN), 3డీ.. కోడ్ మొదలైనవి పొందవచ్చు. ఇక ఆయా బ్యాంకులకు సంబంధిందిన ఖాతాదారులు.. తమ అకౌంట్ వివరాలు.. మనీ ట్రాన్స్ఫర్ వంటి పనులను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సురక్షితమైన మొబైల్ బ్యాంకింగ్ కోసం కొన్ని జాగ్రత్తలను తమ కస్టమర్లకు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
మోసం చేసేవాళ్లు మీ యూపీఐ పిన్ తెలుసుకునేందుకు మీకు ఫోన్ చేస్తారు. అలాంటి మోసాల భారిన పడకండి అంటూ ఐసీఐసీఐ ట్వీట్ చేసింది. మొబైల్ ఫోన్‌లో హ్యాండ్‌సెట్ మెనుని యాక్సెస్ చేయడానికి పిన్/ పాస్‌వర్డ్‌ను సెటప్ చేసుకోవాలని సూచించింది. అలాగే బ్యాంకింగ్ లావాదేవీలను ట్రాక్ చేయడానికి నోటిఫికేషన్స్ కోసం మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీని నమోదు చేసుకోవాలని.. జంక్ మెసేజ్‌లను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపింది.
ట్వీట్..
Be careful of fraudsters trying to convince you to share your UPI PIN over the phone. Stay safe, practice #SafeBanking.
Know more: https://t.co/sY8HeLZLhN#KnowTheDifference #iPledgeSafeBanking pic.twitter.com/J75FK7Pqy8
— ICICI Bank (@ICICIBank) July 21, 2021
తెలియని నంబర్ నుంచి వచ్చే మెసేజ్ లోని యూఆర్ఎల్ పై క్లిక్ చేయకండి. ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయాలని సూచించింది. మీ ఫోన్ లో అకౌంట్ పిన్ నంబర్.. కార్డు వివరాలు సేవ్ చేయకపోవడం మంచిది. అలాగే మీ మొబైల్ పోగొట్టుకుంటే.. వెంటనే బ్యాంకును సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్ అనువర్తనాలను బ్లాక్ చేయండి. తిరిగి ఫోన్ తీసుకున్న తర్వాత వాటిని ఆన్ బ్లాక్ చేయవచ్చు. మీ డెబిట్ / క్రెడిట్ కార్డ్ నంబర్లు, సివివి నంబర్లు లేదా పిన్ వంటి రహస్య సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్‌లో సేవ్ చేయవద్దు. మీ మొబైల్‌లో మీ బ్యాంక్ నుంచి అందుకున్న మెసేజ్ లను సేవ్ చేసుకోకండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో సమర్థవంతమైన మొబైల్ యాంటీ మాల్వేర్ / యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి, దాన్ని అప్‌డేట్ చేసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.
వైర్‌లెస్ పరికర సేవలను ఉపయోగించనప్పుడు వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ వంటివి ఆపివేయండి. Wi-Fi, పబ్లిక్ లేదా షేర్డ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించడం మానుకోండి. ఆపిల్ ఐట్యూన్స్, ఆండ్రాయిడ్ మార్కెట్‌ప్లేస్, గూగుల్ ప్లే స్టోర్, బ్లాక్‌బెర్రీ యాప్ వరల్డ్ వంటి అధికారిక యాప్ స్టోర్స్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని బ్యాంక్ తెలిపింది. ఆన్ లైన్ బ్యాంకింగ్ వివరాలను ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా ఎప్పుడూ పంపదు. మొబైల్ ఫోన్‌ను కోల్పోతే ఐమొబైల్ అప్లికేషన్‌ను డిసేబుల్ చెయ్యడానికి 24-గంటల కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.