AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cars: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో ఆ హ్యూందాయ్‌ కారు నయా వెర్షన్‌.. ధర ఎంతో తెలిస్తే షాక్‌

భారతదేశంలో హ్యూందాయ్‌ కార్లకు ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంది. మధ్యతరగతి వారు భరించే ధరలతో కార్లను రిలీజ్‌ చేయడంతో పాటు అధునాతన ఫీచర్లతో వచ్చే హ్యూందాయ్‌ కార్లను ఇష్టపడని వారు ఉండు. ఈ నేపథ్యంలో హ్యూందాయ్‌ తాజాగా వెర్నా సెడాన్‌ మోడల్‌లో ఎస్‌ఎక్స్‌ ప్లస్‌ వేరియంట్‌ను రిలీజ్‌ చేసింది. హ్యూందాయ్‌ కొత్తగా రిలీజ్‌ చేసిన కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Cars: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో ఆ హ్యూందాయ్‌ కారు నయా వెర్షన్‌.. ధర ఎంతో తెలిస్తే షాక్‌
Hyundai Verna Sx
Nikhil
|

Updated on: Jun 06, 2025 | 3:51 PM

Share

హ్యుందాయ్ కొత్త ఎస్‌ఎక్స్‌ ప్లస్‌ వేరియంట్‌ రిలీజ్‌ చేయడం ద్వారా వెర్నా సెడాన్ శ్రేణిని విస్తరించిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ధర రూ. 13.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు 115 హెచ్‌పీ, 144 ఎన్‌ఎం టార్క్ ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ పెట్రోల్ మోటారుతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో ఎంటీ, ఐవీటీ రెండూ ఉన్నాయి. ఐవీటీ వెర్షన్‌ ధర రూ. 15.04 లక్షల వరకు ఉంటుంది. 

వెర్నా ఎస్‌ఎక్స్‌+ కారులో వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథరెట్ అలరీ, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఎక్స్‌టీరియర్‌ విషయానికి వస్తే ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్లు ఆకట్టుకుంటున్నాయి. ఎస్‌ఎక్స్‌ ప్లస్‌ ట్రిమ్ ఇంటీరియర్‌లో 8.0-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి లక్షణాలు ఆకట్టుకుంటాయి. ఈ సిస్టమ్ వైర్లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్‌ చేస్తుంది. మైలేజ్ విషయానికి మాన్యువల్ వేరియంట్ 18.6 కిలోమీటర్లు మైలేజ్‌ ఇస్తుంది. అయితే ఐవీటీ వేరియంట్‌ 19.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

కొత్త వెర్నా వేరియంట్‌తో పాటు హ్యుందాయ్ వైర్డ్-టు-వైర్లెస్ అడాప్టర్ అనే కొత్త యాక్సెసరీని కూడా విడుదల చేసింది. ఈ అడాప్టర్ ధర రూ. 4,500. అలాగే వెర్నా, గ్రాండ్ ఐ10 నియోస్, ఎకర్, ఆరా, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, అల్కాజార్ వంటి అనేక మోడళ్లకు వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ప్లేను అనుమతిస్తుంది. అలాగే మే 2025లో మొత్తం 58,701 హ్యూందాయ్‌ యూనిట్ల అమ్మకాలు నమోదయ్యయాని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్‌ 43,861 యూనిట్లు అమ్ముడైతే విదేశీ మార్కెట్లకు 14,840 యూనిట్లు రవాణా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..