AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Rules: క్రెడిట్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు.. తెలుసుకోకుంటే జేబు గుల్లే..!

నేడు క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. చేతిలో స్మార్ట్ ఫోన్, జేబులో క్రెడిట్ కార్డు ఉండడం తప్పనిసరిగా మారింది. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా అన్ని బ్యాంకులు వివిధ రాయితీలు, ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు నిబంధనలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. కాలానుగుణంగా వాటిలో మార్పులు జరుగుతూ ఉంటాయి.

Credit Card Rules: క్రెడిట్ కార్డు నిబంధనల్లో భారీ మార్పులు.. తెలుసుకోకుంటే జేబు గుల్లే..!
Credit Cards
Nikhil
|

Updated on: Feb 16, 2025 | 5:19 PM

Share

క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నవారు ఆ మార్పులు, కొత్త చార్జీలను తెలుసుకుంటూ ఉండాలి. లేకపోతే అనవసర చార్జీలు, ఆర్థిక భారాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2025లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, యస్ బ్యాంకుల క్రెడిట్ కార్డు నిబంధనలు మారాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యాక్సిస్ బ్యాంకు

ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు ఎడ్జ్ రివార్డులపై కొత్త రిడెంప్షన్ ఫీజులు విధించింది. వడ్డీ రేట్లలో మార్పులు తెచ్చింది. ఇంధనం, అద్దె చెల్లింపులు, వాలెట్ లోడ్ పై కొత్త చార్జీలు విధిస్తోంది.

యస్ బ్యాంకు

విమాన టిక్కెట్లు, హోటల్ రిజర్వేషన్లపై రివార్డు పాయింట్లను యస్ బ్యాంకు తగ్గించింది. లాంజ్ బెనిఫిట్ల కోసం లిమిట్ ను పెంచింది.

ఇవి కూడా చదవండి

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించేవారు రూ.50 వేలు, ఆ పైన బిల్లులు చెల్లిస్తే ఒక శాతం ఫీజు కట్టాలి. అలాగే రూ.15 వేలకు పైన జరిపి ఫ్యూయల్ ట్రాన్సాక్షన్లపై కూడా ఒక శాతం ఫీజు చెల్లించాలి.

ఎస్బీఐ కార్డు

ఎస్పీఐ కూడా తన క్రెడిట్ కార్డులపై మార్పులు తీసుకువచ్చింది. ఎడ్యుకేషన్, ప్రభుత్వ బిల్లులు, అద్దె, బీబీపీఎస్ చెల్లింపులపై రివార్డు పాయింట్లను నిలిపివేసింది. అలాగే యుటిలిటీ బిల్లులను రూ.50 వేలకు పైన చెల్లిస్తే ఒక శాతం ఫీజు కట్టాలి.

బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనలను మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఖాతాదారుల బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి, మోసాలకు నివారించడానికి, సాంకేతిక పురోగతిని సద్వినియోగం చేసుకోవడానికి బ్యాంకులు ఈ మార్పులు చేస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డు హోల్డర్లు సంబంధిత బ్యాంకుల మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..