Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షాధికారి కావాలనుకుంటున్నారా? అయితే ఈ “12-15-20 ఫార్ములా” ఫాలో అవ్వండి!

వచ్చిన జీతాన్ని వచ్చినట్లే ఖర్చు చేస్తూ డబ్బును గుల్ల చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు రిటైర్మెంట్‌ తర్వాతనో లేక పిల్లలు చదువుల విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్‌ చేయాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు పడొద్దు అనుకుంటే.. ఈ 12-15-20 ఫార్ములాను ఫాలో అవ్వండి.

లక్షాధికారి కావాలనుకుంటున్నారా? అయితే ఈ 12-15-20 ఫార్ములా ఫాలో అవ్వండి!
Indian Currency
Follow us
SN Pasha

|

Updated on: Feb 16, 2025 | 4:48 PM

చాలా మందికి మంచి సంపాదన ఉంటుంది కానీ, సరిగ్గా పొదుపు చేయలేరు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉండే వారికి వేలు, లక్షల్లో జీతం వస్తున్నా.. నెలాఖరికి వాళ్లు జేబులు తడుముకుంటూ ఉంటారు. సరైన పొదుపు చర్యలు లేకపోవడం వల్లే వాళ్లు ఇబ్బంది పడుతుంటారు. నెలకు లక్ష రుపాయలు సంపాదిస్తున్నా.. ఐదేళ్ల తర్వాత కూడా వాళ్లు లక్షాధికారులు కావడం లేదు. వచ్చిన జీతాన్ని వచ్చినట్లే ఖర్చు చేస్తూ డబ్బును గుల్ల చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు రిటైర్మెంట్‌ తర్వాతనో లేక పిల్లలు చదువుల విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్‌ చేయాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు పడొద్దు అనుకుంటే.. ఈ 12-15-20 ఫార్ములాను ఫాలో అవ్వండి. కేవలం 25 సంవత్సరాల వయస్సు నుండి పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, 40 సంవత్సరాల వయస్సులోపు కోట్ల రూపాయలు మీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలాగంటే.. 12 అంటే 12 శాతం రాబడి, 15 అంటే 15 సంవత్సరాల పెట్టుబడి, 20 అంటే ప్రతి నెలా 20 వేల రూపాయల పెట్టుబడి.

ఈ ఫార్ములా సహాయంతో, మీరు 25 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, 40 సంవత్సరాల వయస్సు వచ్చే లోపు భారీ మొత్తం కూడబెట్టుకోవచ్చు. ఓ 15 ఏళ్లు నెలకు రూ.20 వేలు అనుకుంటే రూ.36 లక్షలు అవుతాయి కానీ, వీటిని సరిగ్గా పెట్టుబడి పెడితేనే కోట్లు అవుతాయి. మరి ఎక్కడా? ఎలా? పెట్టుబడి పెట్టాలనే డౌట్‌ వస్తుంది. అందుకు బెస్ట్‌ ఆప్షన్‌ SIP అని చెప్పవచ్చు. మీరు ఇందులో 12 శాతం రాబడిని పొందుతారు. మీ పెట్టుబడి మొత్తం 15 సంవత్సరాలలో రూ.1 కోటి అవుతుంది. దీని కోసం మీరు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు, మీరు ఆ ఫండ్ల గత రాబడి రికార్డును కూడా పరిశీలించాలి. మీరు SIP లో నెలకు రూ.20,000 పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.36 లక్షలు అవుతుంది. SIP కాలిక్యులేటర్ ప్రకారం, మీరు 12% రాబడిని పొందితే, మీకు మొత్తం వడ్డీ రూ.64 లక్షల 91 వేలు లభిస్తుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.1 కోటి 91 వేల రాబడిని పొందుతారు. మీ జీతం 60 నుండి 70 వేల రూపాయల మధ్య ఉంటే, మీరు ప్రతి నెలా 20 వేల రూపాయలను సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఆదాయంలో 30 శాతం పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో మంచి ఆదాయం పొందవచ్చు.

మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.