NPS Vatsalya: పిల్లల కోసం పదవీవిరమణ పథకం ఇది.. ఎలా ప్రారంభించాలంటే..

ఆ పథకం పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)వాత్సల్య. ఇది పిల్లలకు ఉద్దేశించిన పథకం. పదవీవిరమణ ప్రయోజనాలను అందించే పథకం. సింపుల్ గా చెప్పాలంటే మైనర్ల కోసం ప్రారంభించిన రిటైర్ మెంట్ స్కీమ్. దీనిని ప్రారంభించేందుకు ఆన్ లైన్ ప్లాట్ ఫారం ను కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రారంభించింది.

NPS Vatsalya: పిల్లల కోసం పదవీవిరమణ పథకం ఇది.. ఎలా ప్రారంభించాలంటే..
Nps
Follow us

|

Updated on: Sep 24, 2024 | 5:22 PM

పిల్లల కోసం ఓ అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దానిని ప్రారంభించింది. ఆ పథకం పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)వాత్సల్య. ఇది పిల్లలకు ఉద్దేశించిన పథకం. పదవీవిరమణ ప్రయోజనాలను అందించే పథకం. సింపుల్ గా చెప్పాలంటే మైనర్ల కోసం ప్రారంభించిన రిటైర్ మెంట్ స్కీమ్. దీనిని ప్రారంభించేందుకు ఆన్ లైన్ ప్లాట్ ఫారం ను కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రారంభించింది. ఇందు కోసం మైనర్లైన ఖాతాదారులకు పర్మినెంట్ రిటైర్ మెంట్ అకౌంట్ నంబర్(పీఆర్ఏఎన్)ను ఇస్తోంది. ఈ కొత్త పథకం భారతదేశ పదవీ విరమణ వ్యవస్థలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రారంభ దశలోనే పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది.పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) దీనిని నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎన్పీఎస్ వాత్సల్య అంటే..

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం రిటైర్‌మెంట్ ఖాతాలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ఎన్పీఎస్ వాత్సల్య. ఇది చక్రవడ్డీ శక్తితో దీర్ఘకాలంలో మంచి సంపదను అందిసతుంది. ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాదారులకు అనువైన విధంగా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది తల్లిదండ్రులు పిల్లల తరపున సంవత్సరానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. ఇది అన్ని ఆర్థిక వర్గాల కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది.

ఉపసంహరణ, నిష్క్రమణ, మరణం..

  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, విద్య, కొన్ని వ్యాధులు, వైకల్యం కోసం 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తర్వాత కంట్రిబ్యూషన్‌లో 25% వరకు గరిష్టంగా 3 సార్లు ఉపసంహరణ చేసుకోవచ్చు.
  • ఖాతాదారుడికి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ఎన్పీఎస్ టైర్ – I సులభంగా మార్చుకోవచ్చు.
  • 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖాతాను క్లోజ్ చేయొచ్చు. అయితే మీ కార్పస్ రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. కార్పస్‌లో 80% యాన్యుటీని కొనుగోలు చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. 20% మొత్తాన్ని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే మీ కార్పస్ రూ. 2.5 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉంటే మొత్తం బ్యాలెన్స్‌ను ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఖాతాదారుడి మరణం సంభవించినట్లయితే, మొత్తం కార్పస్ సంరక్షకుడికి ఇస్తారు.

ఖాతాను ఎక్కడ తెరవాలి?

ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాని ప్రధాన బ్యాంకులు, ఇండియన్ పోస్ట్ ఆఫీస్, పెన్షన్ ఫండ్స్ మొదలైన వాటితో కూడిన పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ (పీఓపీ) ద్వారా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఈ-ఎన్పీఎస్ ద్వారా తెరవవచ్చు. ది.

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటన ఇలా..

ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్ నకు సంబంధించిన వివరాలను ఐసీఐసీఐ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతా ఎలా ప్రారంభించాలి? దానిలోని ఫీచర్స్ ఏమిటి అనే విషయాన్ని వివరించింది. అవేంటంటే..

  • అర్హత ప్రమాణాలు: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కలిగి ఉన్న 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఏ మైనర్ అయినా అర్హులు.
  • కనీస సహకారం: కనీస పెట్టుబడి సంవత్సరానికి రూ. 1,000, గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.
  • పిల్లల పేరు మీద తల్లిదండ్రులు/సంరక్షకులు తమ పిల్లల తరపున పెట్టుబడి పెట్టొచ్చు.
  • 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత అవసరమైన కేవైసీ పత్రాలను సమర్పిస్తే.. మైనర్ ఎన్పీఎస్ ఖాతా ప్రామాణిక ఎన్పీఎస్ ఖాతాగా మారుతుంది.

ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు..

  • సంరక్షకుని గుర్తింపు, చిరునామా రుజువు
  • మైనర్ పుట్టిన తేదీ రుజువు
  • సంరక్షకుడు ఎన్ఆర్ఐ అయితే మైనర్ ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతా (సింగిల్ లేదా జాయింట్).

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..