Fixed Deposits: ఆన్‌లైన్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..!
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు దేశంలో పొదుపును పెంచుకోవడానికి నమ్మదగిన మార్గంగా ఉంటుంది. ఎఫ్‌డీ ద్వారా ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటుతో నిర్ణీత వ్యవధిలో సొమ్మును డిపాజిట్ చేస్తూ ఉంటూ ఉంటారు. ఎఫ్‌డీ చేయాలంటే కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఆన్‌లైన్ ద్వారా ఎఫ్‌డీ ఖాతా తీసుకోవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన పొదుపు ఎంపికల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయిన తర్వాత కాంపౌండ్ వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని ఇస్తారు. ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా సులభంగా ఖాతా తెరవచ్చని నిపుణుల చెబుతున్నారు. అయితే ఇలా ఖాతా తెరిచే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎఫ్‌డీ తెరవడానికి ముందు, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో వడ్డీ రేట్ల గురించి తెలుసకోవాలి. ముఖ్యంగా మెచ్యూరిటీ సమయంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు ఇప్పటికే కస్టమర్ అయితే మీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. కొత్త వినియోగదారులు వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఖాతాను సృష్టించుకోవాలి. బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్‌ని సందర్శించండి, మీ వివరాలు, డాక్యుమెంట్స్ సమర్పించి కొత్త ఖాతాను తెరవాలి. వీడియో ద్వారా కేవైసీ పూర్తి చేయాలి. లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ డాష్‌బోర్డ్‌లో “ఫిక్సెడ్ డిపాజిట్” లేదా “డిజిటల్ ఎఫ్‌డీ” విభాగాన్ని గుర్తించాలి.
మీరు తెరవాలనుకుంటున్న ఎఫ్‌డీ రకాన్ని బట్టి క్యుములేటివ్, నాన్-క్యుములేటివ్ లేదా పన్ను ఆదా వంటి ఎంపికలను ఎంచుకోవాలి. మీ ఆధార్ నంబర్, పాన్, నామినీ సమాచారం, మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తం వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి. మీ వివరాలను ధృవీకరించిన తర్వాత నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా ఏదైనా ఇతర మద్దతు ఉన్న ఆన్‌లైన్ పద్ధతి ద్వారా చెల్లింపు చేయాలి. పూర్తయిన తర్వాత మీ ఎఫ్‌డీ అధికారికంగా బుక్ చేస్తారు. అయితే ఎఫ్‌డీ దరఖాస్తును పూర్తి చేసే ముందు నిబంధనలు, షరతులను సమీక్షించాలి. ముందస్తు ఉపసంహరణ జరిమానాలు, వడ్డీ చెల్లింపు ఫ్రీక్వెన్సీ, పునరుద్ధరణ ప్రత్యామ్నాయాలపై శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








