RD Calculator: పదేళ్లలో పదహారు లక్షలకు పైగా సంపాదన.. పదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అవకాశం.. మిస్ అవ్వొద్దు..

పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్లకు మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. అయితే ఖాతాదారులు ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్లకు దానిని పొడిగించుకోవచ్చు. అందుకు సంబంధించిన ఓ డాక్యూమెంట్ ను పోస్ట్ ఆఫీసులో సమర్పించి అధిక వడ్డీని పొందే అవకాశం ఉంది.

RD Calculator: పదేళ్లలో పదహారు లక్షలకు పైగా సంపాదన.. పదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అవకాశం.. మిస్ అవ్వొద్దు..
Post Office NSC
Follow us
Madhu

|

Updated on: May 01, 2023 | 4:30 PM

ప్రజల్లో అత్యంత ఆదరణ పొందిన పెట్టుబడి పథకాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ల తర్వాత రికరింగ్ డిపాజిట్లు ఉంటాయి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీనిలో అతి తక్కువగా నెలకు రూ. 100 నుంచి గరిష్టంగా ఎంత వరకైనా పెట్టుబడి పెట్టుకొనే వెసులబాటు ఉంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్ పై వడ్డీ రేటు 6.2శాతంగా ఉంది. ఇది 2023, ఏప్రిల్ ఒకటి నుంచి అమలవుతున్న వడ్డీ. ఈ నేపథ్యంలో రికరింగ్ డిపాజిట్లు పెట్టుబడులు పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి? ఎంత పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది? అన్న విషయాలను ఉదాహరణలతో సహా ఇప్పుడు తెలుసుకుందాం.

ఐదేళ్ల కాలవ్యవధి..

పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్లకు మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. అయితే ఖాతాదారులు ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్లకు దానిని పొడిగించుకోవచ్చు. అందుకు సంబంధించిన ఓ డాక్యూమెంట్ ను పోస్ట్ ఆఫీసులో సమర్పించి అధిక వడ్డీని పొందే అవకాశం ఉంది. నెలకు రూ. 100 నుంచి 10 గుణిజాలలో ఎంత వరకైనా పెట్టుబడులు ఇందులో పెట్టవచ్చు. ఈ నేపథ్యంలో రూ. 1000 పెడితే ఎంత మొత్తం వస్తుంది. రూ. 5000 పెడితే ఎంత మొత్తం రాబడి ఉంటుంది. రూ. 10,000 పెడితే ఎంత వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

నెలకు రూ. 5000 పెట్టుబడికి..

పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం.. మీరు పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్ ఖాతా ప్రారంభించి, నెలకు రూ. 5000 చొప్పున పెట్టుబడి పెట్టారనుకోండి. ఐదేళ్లు లేదా 60 నెలలకు వడ్డీ 6.2శాతంతో ఆ పెట్టుబడి మొత్తం రూ. 3.52 లక్షలు అవుతుంది. అదే ఖాతాను మరో ఐదేళ్లు పొడిగించారనుకోండి.. అంటే పదేళ్లకు మీ మొత్త కార్పస్ రూ. 8.32 లక్షలకు చేరుతుంది.

నెలకు రూ.1000 చొప్పున పెడితే..

మీరు పోస్ట్ ఆఫీసులో ఖాతా ప్రారంభించి నెలకు రూ.1000చొప్పున పెట్టుబడి పెడితే అది వడ్డీతో కలిపి ఐదేళ్లకు రూ. 70,431కి చేరుతుంది. అదే మరో ఐదేళ్లకు కాలపరిమితి పెంచితే మీ మొత్తం కార్పస్ రూ. 1.66 లక్షలకు చేరుతుంది.

రూ. 10,000 చొప్పున పెట్టుబడి పెడితే..

పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్లో భాగంగా మీరు నెలకు రూ. 10,000 పెట్టుబడి పెట్టారనుకోండి. ఐదేళ్లకు మీ మొత్తం పెట్టుబడి వడ్డీతో కలిపి రూ. 7.04 లక్షలు అవుతుంది. అదే మరో ఐదేళ్లు పొడిగిస్తే పదేళ్లకు మొత్త కార్పస్ రూ. 16.6 లక్షలు అవుతుంది.

ఏవరు ఓపెన్ చేయొచ్చు..

పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి జాయింట్ గానైనా ప్రారంభించవచ్చు. అయితే వారి వయస్సు తప్పనిసరిగా పదేళ్లు దాటి ఉండాలి. ఖాతాదారుడు ఒక నెలలో నిర్ణీత మొత్తాన్ని చెల్లించకపోతే రూ.100కు రూ.1 చొప్పున పెనాల్టీ వసూలు చేస్తారు. అదే నాలుగు నెలలు వరుసగా నిర్దేశిత మొత్తం చెల్లించకపోతే ఖాతా డిస్ కంటిన్యూ అయిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!