Tax Saving Tips: ఇంత కంటే ఎక్కువ సంపాదిస్తున్నారా.. ఇలా చేస్తే ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు..
ITR Filing: పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల వరకు ఆదాయపు పన్ను ఆదాను పొందుతున్నారు. అయితే అంతకు మించి ఆదాయం వస్తే పన్ను కట్టాల్సిందే. పన్ను వ్యవస్థ (టాక్స్ స్లాబ్) నిర్మాణం ప్రకారం మీరు పన్ను చెల్లించాలి.

ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు.. జీతాలు తీసుకుంటున్నవారు. మంచి ఉద్యోగం.. అంతకంటే మంచి జీతం.. హాయిగా కష్టపడి సంపాదించిన డబ్బును దాచుకుంటున్నారు. పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నప్పుడు అంతేస్థాయిలో టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు రూ. 5 లక్షల వరకు ఆదాయపు పన్ను ఆదాను పొందుతున్నారు. అయితే అంతకు మించి ఆదాయం వస్తే పన్ను కట్టాల్సిందే. టాక్స్ స్లాబ్ ప్రకారం మీరు పన్ను చెల్లించాలి. కానీ మీరు రూ. 5 లక్షలు దాటి రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నట్లైతే టాక్స్ కట్టాల్సి ఉంటుంది.. ఇలాంటి సమయంలో కూడా మీరు పన్ను ఆదా చేయవచ్చు. ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ప్రయోజనం పొందగల అనేక పథకాలు చాలా ఉన్నాయి.
మీరు పన్ను ప్రయోజనం పొందుతారు. రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా పన్ను ఆదా చేసుకోవచ్చు.. ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం.. ప్రస్తుతం సంవత్సరానికి రూ. 2.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 2.5 నుంచి 5 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 5% పన్ను విధించబడుతుంది. 5 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం 20 శాతం, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం 30 శాతం పన్ను విధించబడుతుంది.
ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చంటే..
- మీ ఆదాయం రూ.10,50,000 అనుకుందాం. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 తగ్గుతుంది . స్టాండర్డ్ డిడక్షన్ మిగిలిన మొత్తంపై లెక్కించబడుతుంది. తదుపరి ఆదాయాలపై పన్ను లెక్కించబడుతుంది. ఉపాధి పొందిన ఉద్యోగులు, పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం పొందుతారు. రూ. 50,000 తగ్గింపు మీ ఆదాయాన్ని దాదాపు రూ. 10,00,000కి తీసుకువస్తుంది.
- ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ 80సి కింద రూ.1.5 లక్షల వరకు రాయితీ లభిస్తుంది. మీరు EPF, PPF, ELSS, NSC వంటి పథకాలలో మీ పెట్టుబడులపై రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. 10,00,000 నుంచి రూ.1.5 లక్షలు తగ్గుతాయి. ఈ ఆదాయం రూ.8,50,000 అవుతుంది.
- మీరు మీ కుటుంబానికి ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకుంటే రూ.25,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. రూల్ 80డి కింద రూ. 25,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య బీమా పథకాలలో రూ. 50,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
- ఈ రెండు ప్రక్రియల్లోనూ మీరు రూ. 75,000 ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు 8,50,000 నుంచి 75,000 కు తగ్గించబడింది. మీ ఆదాయం రూ. 7, 75,000గా ఉంటుంది. మీ తలపై హోమ్ లోన్ భారం ఉండవచ్చు లేదా మీరు ఆస్తిని కొనుగోలు చేసి ఉండవచ్చు. అయినా సద్వినియోగం చేసుకోవచ్చు.
- మరోవైపు, గృహ రుణంపై పన్ను నిబంధన 24B కింద రూ. 2 లక్షల వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు మీరు రూ.7,75,000 నుంచి రూ.2,00,000 తీసివేస్తే, మీ ఆదాయం రూ.5,75,000 అవుతుంది.
- మీరు NPSలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 50,000 వరకు ఆదా చేసుకోవచ్చు. జాతీయ పెన్షన్ పథకంలో రూ. 50,000 వరకు పెట్టుబడి పెడితే సెక్షన్ 80CCD (1B) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. రూ.5,75,000 నుంచి రూ.50,000 తీసివేసిన తర్వాత, పన్ను విధించదగిన ఆదాయం రూ.5,25,000 అవుతుంది.
- మీరు మంచి పనికి డబ్బు విరాళంగా ఇచ్చారు. మీరు ఫైనాన్స్ చేసి, మీ వద్ద రసీదు ఉంటే సెక్షన్ 80G కింద రూ. 25,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఐదు లక్షల రూపాయల ఆదాయానికి వచ్చారు.
- రూ.5,00,000 ఆదాయంపై రూ.12,500 పన్ను విధించబడుతుంది. సెక్షన్ 87A కింద రూ.12500 తగ్గింపు లభిస్తుంది. కాబట్టి చివరికి మీరు ఒక్క శాతం కూడా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం




