AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకరావచ్చు..? లిమిట్ దాటితే ఫైన్ ఎంత విధిస్తారో తెలుసా..?

దుబాయ్‌లో బంగారం తక్కువ ధరకు వస్తుందని ఇష్టారాజ్యంగా తెచ్చుకుంటే మీరు చిక్కుల్లో పడతారు. విదేశాల నుంచి బంగారం తేవాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ అతిక్రమిస్తే మీరు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. ఇటీవలే రన్యారావుకు అక్రమ బంగారం తెచ్చినందుకు ఏకంగా రూ.102కోట్ల జరిమానా విధించారు.

Gold: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకరావచ్చు..? లిమిట్ దాటితే ఫైన్ ఎంత విధిస్తారో తెలుసా..?
Bringing Gold From Dubai To India
Krishna S
|

Updated on: Sep 03, 2025 | 5:06 PM

Share

దుబాయ్‌ను బంగారు నగరం అని పిలుస్తారు. అక్కడ బంగారం ధర భారత్‌తో పోలిస్తే 8 నుండి 9 శాతం తక్కువగా ఉంటుంది. ధర తక్కువగా ఉండడం భారతీయులను అట్రాక్ట్ చేస్తోంది. కానీ దుబాయ్ నుండి దేశానికి ఎంత బంగారం తీసుకురావచ్చు. వాటికి ఫైన్ ఎంత ఉంటుంది అనే అంశాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.

దుబాయ్ నుండి బంగారం.. లాభమా, నష్టమా?

దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 85,000-88,000 మధ్య ఉంది. అదే బంగారం భారత్‌లో సుమారు 8-9% ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ వ్యత్యాసం కారణంగా చాలా మంది దుబాయ్ నుండి మన దేశానికి బంగారం తీసుకురావాలనుకుంటారు. అయితే భారత ప్రభుత్వం దీనిపై కొన్ని కఠినమైన నిబంధనలను రూపొందించింది. ఈ నియమాలను పాటించకపోతే బంగారం లాభానికి బదులు నష్టాన్ని మిగులుస్తుంది.

బంగారం తీసుకురావాలంటే ఇవి పాటించాల్సిందే..

భారత ప్రభుత్వం ప్రకారం.. విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చే భారతీయ పౌరులకు కొన్ని రాయితీలు ఉన్నాయి.

పురుషులు: రూ. 50,000 వరకు విలువైన బంగారు ఆభరణాలు పన్ను లేకుండా తీసుకురావచ్చు.

మహిళలు: రూ. 1 లక్ష వరకు విలువైన బంగారు ఆభరణాలు పన్ను లేకుండా తీసుకురావచ్చు.

15 ఏళ్లలోపు పిల్లలు: పురుషులు, మహిళలకు ఉన్న మినహాయింపులే వీరికీ వర్తిస్తాయి.

ఈ మినహాయింపులు బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి. బంగారు కడ్డీలు లేదా నాణేలకు కాదు. ఇంకా బంగారం కొనుగోలుకు చెల్లుబాటు అయ్యే బిల్లు తప్పనిసరి. బిల్లు లేకుండా బంగారం తీసుకువస్తే అది జప్తు అవుతుంది. జరిమానా కూడా విధిస్తారు.

పరిమితికి మించి బంగారం తీసుకువస్తే..

మీరు పరిమితికి మించి బంగారం తీసుకురావాలనుకుంటే.. మీరు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. మీరు ఎంత బంగారం తీసుకువస్తున్నారనే దాన్ని బట్టి పన్ను రేటు మారుతుంది.

20 నుండి 50 గ్రాముల బంగారం: 3శాతం పన్ను.

50 నుండి 100 గ్రాముల బంగారం: 6శాతం పన్ను.

100 గ్రాములకు పైగా బంగారం: 10శాతం పన్ను.

మీరు కనీసం 6 నెలలు విదేశాల్లో ఉంటే మీరు ఒక కిలో వరకు బంగారం తీసుకురావచ్చు. అయితే మీరు దాన్ని కస్టమ్స్ అధికారులకు తెలియజేసి, పన్ను చెల్లించాలి. ఈ పన్ను రేట్లు, నిబంధనలు పారదర్శకంగా ఉన్నంత వరకే వర్తిస్తాయి. మీరు బంగారాన్ని అక్రమ మార్గాల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తే, జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది.

రన్యా రావు కేసు: ఒక హెచ్చరిక

ఇటీవల కన్నడ నటి రన్యా రావు బెంగళూరు విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టు అయ్యారు. ఆమె వద్ద దాదాపు 15 కిలోల బంగారం దొరికింది. ఈ కేసులో ఆమెకు రూ. 102 కోట్లకు పైగా జరిమానా విధించారు. ఇది నిబంధనలను పాటించకపోతే జరిగే తీవ్రమైన పరిణామాలకు ఒక ఉదాహరణ.

బంగారం దుబాయ్‌లో చౌకగా ఉండవచ్చు, కానీ చట్టబద్ధంగా తీసుకురాకపోతే అది పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితుల్లో, చెల్లుబాటు అయ్యే బిల్లుతో, సరైన పన్ను చెల్లింపుతో బంగారం తీసుకురావడం లాభదాయకంగా ఉంటుంది. కానీ నియమాలను ఉల్లంఘిస్తే, జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..