రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..!

వేసవి వచ్చిదంటే చాలు.. భానుడి భగభగల నుంచి జనాలకు ఉపశమనాన్ని కలిగించే ఏకైక మార్గం ఒక్క ఏసీనే. సమ్మర్ సీజన్‌లో ప్రతీ ఇంట్లో ఈ ఏసీ రన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇతర కరెంట్ పరికరాలతో పోలిస్తే.. ఏసీ వాడకంతో బిల్లు తడిసిమోపెడవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చాలామంది..

రాత్రంతా ఏసీ ఆన్ చేసి పడుకుంటున్నారా.? కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..!
Ac Bill
Follow us

|

Updated on: Apr 30, 2024 | 6:05 PM

వేసవి వచ్చిదంటే చాలు.. భానుడి భగభగల నుంచి జనాలకు ఉపశమనాన్ని కలిగించే ఏకైక మార్గం ఒక్క ఏసీనే. సమ్మర్ సీజన్‌లో ప్రతీ ఇంట్లో ఈ ఏసీ రన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇతర కరెంట్ పరికరాలతో పోలిస్తే.. ఏసీ వాడకంతో బిల్లు తడిసిమోపెడవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే చాలామంది మిడిల్ క్లాస్ వ్యక్తులు ఏసీ కొనుగోలు చేయాలంటేనే కొంచెం వెనకడుగు వేస్తారు. అయితే అసలు ఏసీ రాత్రంతా ఆన్ చేసి ఉంచితే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెల్సా.? సాధారణం జనాలు ఎవరైనా కూడా తమ ఇంట్లో 1.5 టన్ను ఏసీని ఇంట్లో అమర్చుకుంటూ ఉంటారు. అలాగే ఏసీలలో 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అని రేటింగ్స్ కూడా ఉంటాయి. వీటి బట్టి అసలు ఏసీ వాడకం వల్ల ఎంత బిల్లు వస్తుందో తెలుసా.?

మీకు మార్కెట్‌లో 1-5 స్టార్ రేటింగ్స్‌తో కూడిన ఏసీలు అందుబాటులో ఉంటాయి. 1స్టార్ ఏసీ తక్కువ ధరకే దొరుకుతున్నా.. విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. ఇక 5 స్టార్ ఏసీ యమా కాస్ట్లీగా ఉంటుంది. కానీ దీని శక్తి సామర్ధ్యాలు ఎక్కువ ఉంటాయి. అలాగే 3 స్టార్ ఏసీ కూడా మాంచి కూలింగ్‌తో పాటు మీ జేబుకు చిల్లు పడనివ్వదు. ఒకవేళ మీరు మీ ఇంట్లో 5 స్టార్ రేటింగ్ 1.5 టన్ను స్ప్లిట్ ఏసీ అమర్చితే.. గంటకు దాదాపుగా 840 వాట్ల కరెంట్ వినియోగిస్తుంది. అంటే రాత్రి 8 గంటలు వేసుకుంటే సుమారు 6.4 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతోంది. ఇక మీ ప్రాంతంలో యూనిట్ రేటు రూ. 7.50 నుంచి 8.50 మధ్యలో ఉంటే.. నెలకు దాదాపుగా పదిహేను వందల నుంచి మూడు వేల వరకు కరెంట్ బిల్లు వస్తుంది.