AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Microcar: ఇద్దరు ప్రయాణించే బుల్లి కారు.. భలేగుందే.. పెట్రోల్‌తో పనేలేదు.. అత్యాధునిక సాంకేతికతో..

ఈ మైక్రో కారు చిన్న బాక్స్ మాదిరిగా కనిపిస్తుంది. దీని డిజైన్ చూస్తే మీకు ఇటీవల లాంచ్ అయిన ఎంజీ కామెట్ కారు గుర్తొస్తుంది. అయితే ఈ హోండా మైక్రో కారుకి దానికి తేడా ఉంది. ఎంజీ కామెట్ కారు 4 సీటర్ కాగా.. ఇది కేవలం టూ సీటర్ మాత్రమే. ఈ మైక్రోకారులో ఆరు వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో కారు చుట్టూ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి.

Honda Microcar: ఇద్దరు ప్రయాణించే బుల్లి కారు.. భలేగుందే.. పెట్రోల్‌తో పనేలేదు.. అత్యాధునిక సాంకేతికతో..
Honda Micro Car
Madhu
|

Updated on: Oct 27, 2023 | 8:35 AM

Share

ఎలక్ట్రిక్ వేరియంట్ కార్ల తయారీలో కంపెనీలు పోటి పడుతున్నాయి. గ్లోబల్ వైడ్ గా ఇదే వాతావరణం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్తాలు పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై తయారీలో ముందుకుసాగుతున్నాయి. హై రేంజ్ నుంచి సాధారణ రేంజ్ వరకూ పలు రకాల మోడళ్లు లాంచ్ అవుతున్నాయి. సరికొత్త ఆవిష్కరణలతో తయారీదారులు తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. ఇటీవల మన దేశంలో ఎంజీ కంపెనీ నుంచి చిన్న కారు కామెట్ ఈవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి పోటీగా హోండా మరో మైక్రో కారును లాంచ్ ఆవిష్కరించింది. ప్రపంచంలో మొట్టమొదటి టూ సీటర్ ఎలక్ట్రిక్ కారు లెవెల్ 4 అడాస్ టెక్నాలజీతో తీసుకొచ్చింది. సీఐ-ఎంఈవీ పేరుతో దీనిని జపాన్ లోని ఆటో షోలో ప్రదర్శించింది. ఈ మైక్రోకారు మూడు చక్రాలతో కూడా నడవగలుగుతుంది. ఈ కారు గురించి జపాన్ లో చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. ఇటీవలే హోండా ఎగిరి కారును ప్రదర్శించింది.

హోండా సీఐ-ఎంఈవీ..

ఈ మైక్రో కారు చిన్న బాక్స్ మాదిరిగా కనిపిస్తుంది. దీని డిజైన్ చూస్తే మీకు ఇటీవల లాంచ్ అయిన ఎంజీ కామెట్ కారు గుర్తొస్తుంది. అయితే ఈ హోండా మైక్రో కారుకి దానికి తేడా ఉంది. ఎంజీ కామెట్ కారు 4 సీటర్ కాగా.. ఇది కేవలం టూ సీటర్ మాత్రమే. ఈ మైక్రోకారులో ఆరు వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఇవి 360 డిగ్రీల కోణంలో కారు చుట్టూ ప్రాంతాన్ని కవర్ చేస్తాయి. తద్వారా కారుకు సమీపంలోని వాహనాలను స్క్రీన్ పై చూడగలిగే వీలుంటుంది. హోండా చెబుతున్న దాని ప్రకారం ఈ సీఐ-ఎంఈవీ కారులో లెవెల్ 4 అడాస్ టెక్నాలజీ ఉంటుంది.

చాలా చిన్నది..

ఈ మైక్రో కారు సాధారణ కారుతో పోల్చితే చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. తక్కువ సైజ్ లో ఉంటుంది కాబట్టి సులువుగా మలుపులు తిరగడానికి బావుంటుంది. అంతేకాక దీనిలో హోండాకు చెందిన కోఆపరేటివ్ ఇంటెలిజెన్స్(సీఐ)అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని వినియోగించారు. ప్రస్తుతం ఈ వాహనాన్ని నాలుగు చక్రాలతోనే అభివృద్ధి చేస్తున్నారు. రానున్న కాలంలో మూడు చక్రాలతో కూడా దీనిని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది అర్బన్ ప్రాంతాలకు సరిగ్గా సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఎలక్ట్రిక్ కారులో నాలుగు రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఈ బ్యాటరీ ప్యాక్ ని హోండా మొబైల్ పవర్ ప్యాక్ అని పిలుస్తారు. అది కారులోని ట్రంక్ కింది భాగంలో ఉంటుంది. వీటి సాయంతో పెట్రోల్ తో పని లేకుండా ఎంచక్కా ప్రయాణం చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..