SBI Interest Rates: ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అధిక రాబడి.. ఎస్‌బీఐ అందించే ఆ పథకాల్లో ప్రధాన తేడాలివే..!
భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అంటే భారతీయులకు ఓ నమ్మకం. అధిక బ్రాంచ్‌లతో నాణ్యమైన సేవలను అందించడంతో గ్రామీణుల దగ్గర నుంచి పట్టణ ప్రాంత ప్రజల వరకూ ఎస్‌బీఐ అంటే ఇష్టపడతారు. ఎస్‌బీఐ కూడా వివిధ పథకాలతో ఖాతాదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రత్యేక పెట్టుబడి పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇటీవల ఎస్‌బీఐ అమృత్ కలశ్ పేరుతో సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది.
కష్టపడి సంపాదించిన సొమ్ముకు భరోసాతో పాటు నమ్మకమైన రాబడి పొందాలని సగటు పెట్టుబడిదారుడు అనుకుంటూ ఉంటారు. అందుకు అనుగుణంగా ఏయే పథకాలు అందుబాటులో ఉన్నాయో? తరచూ వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఇలాంటి పథకాల వైపు ఆసక్తి చూపుతూ ఉంటారు. సాధారణంగా భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అంటే భారతీయులకు ఓ నమ్మకం. అధిక బ్రాంచ్‌లతో నాణ్యమైన సేవలను అందించడంతో గ్రామీణుల దగ్గర నుంచి పట్టణ ప్రాంత ప్రజల వరకూ ఎస్‌బీఐ అంటే ఇష్టపడతారు. ఎస్‌బీఐ కూడా వివిధ పథకాలతో ఖాతాదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ప్రత్యేక పెట్టుబడి పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఇటీవల ఎస్‌బీఐ అమృత్ కలశ్ పేరుతో సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. అలాగే ఎస్‌బీఐ వుయ్ కేర్ పేరుతో ఇప్పటికే ఓ పథకాన్ని అందుబాటులో ఉంచింది. ఎస్‌బీఐ సాంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఆకర్షణీయ వడ్డీ రేట్లతో వస్తాయి. అయితే ఈ మూడు పథకాల్లో ఎందులో వడ్డీ అధికంగా వస్తుందో ఓ సారి తెలుసుకుందాం.
ఎస్‌బీఐ ఎఫ్‌డీ పథకాలు
ఎస్‌బీఐ ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎస్‌బీఐ ఎఫ్‌డీలు సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.1 శాతం వరకు ఇస్తాయి. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అదనంగా పొందుతారు. ఏడు రోజుల నుంచి 45 రోజులకు 3 శాతం, 46 రోజుల నుంచి 179 రోజులకు 4.5 శాతం, 180 రోజుల నుంచి 210 రోజులకు 5.25 శాతం, 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 5.75 శాతం, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.8 శాతం, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువకు 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తాయి.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకం
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీ) ఫిబ్రవరిలో “400 రోజుల” (అమృత్ కలశ్) నిర్దిష్ట అవధి పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఎఫ్‌డీ సీనియర్ సిటిజన్‌లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెడితే ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉండదు. అయితే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆగస్టు 15 ఆకరి గడువుగా ఉంది.
ఎస్‌బీఐ వుయ్ కేర్ డిపాజిట్ పథకం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని పొడిగించింది. వుయ్ కేర్ పేరుతో వచ్చే ఈ పథకం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలవ్యవధిలో వృద్ధులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఎస్‌బీఐ ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి గడువును సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగించింది. తాజా డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల పునరుద్ధరణపై ఈ పథకం అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ వుయ్ కేర్ వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది.