Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata: రివేంజ్ అంటే ఇలా ఉండాలి.. రతన్ టాటా నుంచి యువత నేర్చుకోవాల్సిందిదే..

ఫోర్డ్ కంపెనీ ప్రతినిధుల మాటలు బాధించడంతో రతన్ టాటా ఎలాగైనా ఈ కార్ల రంగంలో రాణించాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఇండికా కార్లలో కొన్ని కీలక మార్పులు చేసి, రీలాంచ్ చేశారు. ఇప్పుడు కారు క్లిక్ అయ్యింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత నుంచి నేటి వరకూ టాటా గ్రూప్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Ratan Tata: రివేంజ్ అంటే ఇలా ఉండాలి.. రతన్ టాటా నుంచి యువత నేర్చుకోవాల్సిందిదే..
Ratan Tata Sweet Revenge
Follow us
Madhu

|

Updated on: Oct 15, 2024 | 3:47 PM

దేశంలోని టాప్ వ్యాపార దిగ్గజం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. అంకితభావానికి , అనుకున్నది సాధించాలని కలలు కనే ప్రతి ఒక్కరికి స్ఫూర్తి, ఆదర్శం రతన్ టాటా. దేశంలోని ఎత్తయిన పారిశ్రామిక శిఖరం. ఆయన తన జీవితంలో అనేక ఎత్తు పల్లాలు చూశారు. ఎన్నో అవమానాలు భరించారు. అయినప్పటికీ తాను అనుకున్నది సాధించి చిరస్థాయిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. ప్రపంచంలోని ప్రముఖ లగ్జరీ కార్లు అయిన రేంజ్ రోవర్, జాగ్వర్ ఎఫ్-టైప్ వంటి కార్ల తయారీ సంస్థ అయిన జాగ్వర్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్)ను మన దేశంలో టాటా మోటార్స్ కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఇది వ్యాపార నిర్ణయంగా అందరూ భావిస్తారు. కానీ ఇది రతన్ టాటా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన కీలకమైన అంశమని చాలా మందికి తెలియదు. ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ కంపెనీ అయిన ఫోర్డ్ చేసిన అవమానానికి రివేంజ్ గానే ఈ కంపెనీని టాటా కొనుగోలు చేశారని చాలా మంది చెబుతుంటారు. ఫోర్డ్ కంపెనీపై రతన్ టాటా స్వీట్ రివేంజ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాడు అవమానం..

టాటా నుంచి వచ్చిన తొలి కారు ఇండికా. వాస్తవానికి రతన్ టాటా కలల ప్రాజెక్టు అది. అలాంటి కారు ఎన్నో అంచనాల 1988లో లాంచ్ చేసింది. అయితే మార్కెట్లో అది క్లిక్ అవ్వలేదు. దీంతో నష్టాల్లోకి వెళ్లిన టాటా కంపెనీ దానిని విక్రయించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో 1999లో గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం అయిన ఫోర్డ్ తో చర్చలు మొదలు పెట్టింది. దీనిపై మాట్లాడేందుకు రెండు కంపెనీల ప్రతినిధులు న్యూయార్క్ లో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఫోర్ట్ ప్రతినిధులు టాటా గ్రూప్ పట్ల అమర్యాదగా మాట్లాడారు. ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఒక అడుగు ముందుకేసి, కార్ల వ్యాపారం చేయడం చేతకానీ వారు, దీనిలోకి ఎందుకొచ్చారంటే ఎగతాళిగా మాట్లాడారు. దీనిని అవమానంగా భావించిన రతన్ టాటా ఆ డీల్ ను రద్దు చేసుకుని వచ్చేశారు.

ఎలాగైనా క్లిక్ అవ్వాలని..

ఫోర్డ్ కంపెనీ ప్రతినిధుల మాటలు బాధించడంతో రతన్ టాటా ఎలాగైనా ఈ కార్ల రంగంలో రాణించాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఇండికా కార్లలో కొన్ని కీలక మార్పులు చేసి, రీలాంచ్ చేశారు. ఇప్పుడు కారు క్లిక్ అయ్యింది. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత నుంచి నేటి వరకూ టాటా గ్రూప్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మరోవైపు టాటా గ్రూప్ ను అవమానించిన ఫోర్డ్ కంపెనీ నష్టాల బాట పట్టి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది.

అవమానం నుంచి ప్రతీకారం..

ఫోర్డ్ కంపెనీ నష్టాల నుంచి బయట పడేందుకు 2008లో తన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ తయారీ సంస్థను విక్రయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రతన్ టాటా ఆ కంపెనీని కొనుగోలు చేశారు. దాదాపు 2.3 బిలియన్ డాలర్లు అంటే రూ. 9,300కోట్లు పెట్టి దానిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ లగ్జరీ కార్ల బ్రాండ్ ను రతన్ టాటా తన చాకచక్యంతోనే లాభాల బాట పట్టించారు. ఇప్పుడు ఆ లగ్జరీ కార్లు టాటా కంపెనీ భారీ లాభాలు గడించి పెడుతున్నాయి. ఈ విధంగా రతన్ టాటా తనను అవమానించిన వారి చేతనే శభాష్ అనిపించుకుని అందరికీ ఆదర్శంగా నిలించారు. కేవలం తన వ్యాపారం నైపుణ్యంతోనే సమాధానం చెప్పిన రతన్ టాటాను మనందరు స్ఫూర్తిగా తీసుకొని, ఆయనకు ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..