AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Pension System: నెలకు రూ. 5వేల పెట్టుబడితో.. రూ. 45,000 వరకూ పెన్షన్.. భార్యకు ప్రేమతో ఈ పథకాన్ని ప్రారంభించండి..

మీరు మీ భార్యల పేరు మీద న్యూ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ఖాతా ప్రారంభించవచ్చు. ఈ ఖాతా ద్వారా మీ భార్యకు 60ఏళ్లు వచ్చే సరికి పెద్ద మొత్తంలో నగదు సమకూరుతుంది. దీంతో పాటు నెలవారీ పెన్షన్ రూపేణా కొంత మొత్తం అందుతుంది. ఇది మాత్రమేకాదు ఈ ఎన్సీఎస్ ఖాతా ద్వారా మీ భార్య నెలవారీ ఎంత మొత్తం పెన్షన్ గా పొందాలో మీరే డిసైడ్ చేయొచ్చు. దీంతో మీ భార్య వృద్ధాప్యంలో మీరున్నా లేకున్నా ఎవరిపైనా ఆధారపడకుండా బతకగలుగుతారు.

New Pension System: నెలకు రూ. 5వేల పెట్టుబడితో.. రూ. 45,000 వరకూ పెన్షన్.. భార్యకు ప్రేమతో ఈ పథకాన్ని ప్రారంభించండి..
Retirement
Madhu
|

Updated on: Aug 23, 2023 | 11:35 AM

Share

వృద్ధాప్యంలో ఆర్థిక వెసులుబాటు చాలా అవసరం. ఆ సమయంలో ఒంట్లో సత్తువ ఉండదు. కష్టపడే అవకాశం తక్కువ. అందుకే ముందుగానే వృద్ధాప్యంలో అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకొని డబ్బు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా భర్త ఉన్నా లేకున్నా భార్యలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయాల్సి బాధ్యత భర్తలపై ఉంది. అప్పుడు మీ భార్య కూడా ఎవరిపైనా ఆధారపడకుండా స్వతహాగా బతకగలుతారు. అలాంటి వారి కోసమే అద్భుతమైన పథకం ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాని పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్. దీనిలో పెట్టుబడి చాలా సురక్షితమైంది. మైగా అధిక వడ్డీ వస్తుంది. ఇది పదవీవిరమణ తర్వాత మీకు, మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ నేపథ్యంలో నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) అంటే ఏమిటి? ఎలా ప్రారంభించాలి? ప్రయోజనాలు ఏంటి? అది మీ భార్యలకు ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం రండి..

ఎలా ప్రారంభించాలంటే..

మీరు మీ భార్యల పేరు మీద న్యూ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఖాతా ప్రారంభించవచ్చు. ఈ ఖాతా ద్వారా మీ భార్యకు 60ఏళ్లు వచ్చే సరికి పెద్ద మొత్తంలో నగదు సమకూరుతుంది. దీంతో పాటు నెలవారీ పెన్షన్ రూపేణా కొంత మొత్తం జమవుతుంది. ఇది మాత్రమేకాదు ఈ ఎన్సీఎస్ ఖాతా ద్వారా మీ భార్య నెలవారీ ఎంత మొత్తం పెన్షన్ గా పొందాలో మీరే డిసైడ్ చేయొచ్చు. దీంతో మీ భార్య వృద్ధాప్యంలో మీరున్నా లేకున్నా ఎవరిపైనా ఆధారపడకుండా బతకగలుతుంది. ఇప్పుడు ఈ స్కీమ్ గురించిన పూర్తి వివరాలు చూద్దాం..

నెలనెలా నగదు..

ఈ ఎన్పీఎస్ ఖాతాలో మీరు సౌకర్యాన్ని బట్టి నెల నెలా ఎంతో కొంత మొత్తాన్ని జమచేయొచ్చు. లేదా ఏడాది ఒకసారే జమచేయచ్చు. కేవలం రూ. 1000లతో ఈ ఖాతాను మీ భార్య పేరుమీద ప్రారంభించవచ్చు. ఖాతాదారు వయసు 60ఏళ్లు వచ్చిన తర్వాత మెచ్యూర్ అవుతుంది. కావాలనుకొంటే 65ఏళ్ల వరకూ ఖాతాను పొడిగించుకోవచ్చు.

నెలకు రూ. 45,000 వరకూ పొందచ్చు..

ఉదాహరణకు ప్రస్తుతం 30ఏళ్లు అనుకుందాం. ఇప్పుడు మీరు ఎన్పీఎస్ ఖాతా ప్రారంభించి, నెలకు రూ. 5,000 చొప్పున జమచేస్తున్నారనుకొండి. ప్రతి ఏటా ఆమె పెట్టిన పెట్టుబడిపై 10శాతం ఆదాయాన్ని పొందుతుంది. అలా ఆమె 60ఏళ్లకు చేరుకొనే సమయానికి రూ. 1.12కోట్లు ఆమె ఖాతాలో ఉంటాయి. దీనిలో రూ. 45లక్షలు ఆమె తీసుకునే వీలుంటుంది. దీంతో పాటు ప్రతి నెల రూ. 45,000 పెన్షన్ కూడా తీసుకునే వీలుంటుంది. ఈ పెన్షన్ ఆమె బతికున్నట్ల కాలం తీసుకునే వెసులుబాటు ఈ స్కీమ్ లో ఉంటుంది.

సింపుల్ గా ఇలా..

  • ఖాతా ప్రారంభించాల్సిన వయసు- 30 ఏళ్లు
  • మొత్తం మీరు పెట్టుబడి పెడుతున్న కాలం- 30 ఏళ్లు
  • నెలకు ఖాతాలో జమచేస్తున్న మొత్తం- రూ. 5,000
  • పెట్టుబడిపై వచ్చే రిటర్న్(అంచనా)- 10శాతం
  • మెచ్యూరిటీ సమయానికి వచ్చే మొత్తం- రూ. 1,,11,198471(ఇది మెచ్యూరిటీ సమయానికి విత్ డ్రా చేసుకోవచ్చు)
  • యాన్యూటీ ప్లాన్ కొనుగోలుకు చార్జ్- రూ. 79,388
  • యాన్యూటీ రేటు 8శాతం(అంచనా)- రూ. 67,19,083
  • నెలకు వచ్చే పెన్షన్- రూ. 44,793

మీ నగదుకు పూర్తి భద్రత..

ఎన్పీఎస్ కు కేంద్ర ప్రభుత్వ మద్ధతు ఉంది. అందుకని మీ నగదుకు పూర్తి భద్రత ఉంటుంది. మీరు చెల్లించే ఈ మొత్తాన్ని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫండ్ మేనేజర్ల బాధ్యత తీసుకుంటుంది. అందువల్ల ఎన్పీఎస్ లో మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. అయితే ఈ పథకంలో రాబడి అనేది కచ్చితంగా ఇంత వస్తుంది చెప్పలేం. ఆర్థిక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం సగటున ఏడాదికి 10 నుంచి 11 శాతం అయితే ఆదాయం రిటర్న్ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..