Cyber Fraud Insurance: రూ.3కే సైబర్ దాడుల నుంచి రక్షణ.. కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్..
వాహనాలు చోరీకి గురైనా, ప్రమాదం జరిగిన వెహికల్ ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు బీమా కంపెనీలో కొత్త రకం ఇన్స్యూరెన్స్ ను తీసుకువచ్చాయి. సైబర్ మోసాల బారిన పడే వ్యక్తులు, కంపెనీలకు బీమా అందజేస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక్క టీ ధర కనీసం పది రూపాయలు ఉంటుంది. ఆ డబ్బులతో మూడు రోజుల పాటు బీమా కవరేజీ లభిస్తుంది.
జీవితంలో అనుకోని ఆపద, నష్టాలు సంభవించినప్పుడు మనల్ని ఆదుకోవడానికి బీమా పథకాలు (ఇన్స్యూరెన్స్) చాలా ఉపయోగపడతాయి. ఆ సమయంలో ఆర్థిక నష్టాలు కలగకుండా చేదోడుగా ఉంటాయి. సాధారణంగా జీవిత బీమాతో పాటు వాహనాలు, ఆరోగ్యం తదితర వాటికి ఇన్స్యూరెన్స్ తీసుకుంటూ ఉంటాం. యజమాని మరణించినా, అంగవైకల్యం సంభవించినా జీవిత బీమా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. వాహనాలు చోరీకి గురైనా, ప్రమాదం జరిగిన వెహికల్ ఇన్స్యూరెన్స్ ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు బీమా కంపెనీలో కొత్త రకం ఇన్స్యూరెన్స్ ను తీసుకువచ్చాయి. సైబర్ మోసాల బారిన పడే వ్యక్తులు, కంపెనీలకు బీమా అందజేస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక్క టీ ధర కనీసం పది రూపాయలు ఉంటుంది. ఆ డబ్బులతో మూడు రోజుల పాటు బీమా కవరేజీ లభిస్తుంది.
రోజుకు కేవలం మూడు రూపాయలే..
ఐడెంటిటీ చోరీ, సైబర్ దోపిడీ, ఆన్ లైన్ బెదిరింపుల నుంచి భద్రతకు బీమా కంపెనీలు ఇన్స్యూరెన్స్ అందజేస్తున్నాయి. వీటికి రోజుకు కేవలం రూ.3 చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం సాచెట్ కవర్లు అని పిలిచే చిన్న సైబర్ సెక్యూరిటీ కవర్లను రూపొందించాయి. ఆయా కంపెనీలు, వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు నుంచి రక్షణ పొందవచ్చు. ఈ బీమా కవర్ల కోసం రోజుకు మూడు రూపాయాలు చెల్లిస్తే సరిపోతుంది.
పెరిగిన మోసాలు..
ఆధునిక కాలంలో ప్రతి పనిని టెక్నాలజీ సాయంతో చాలా సులువుగా చేయవచ్చు. ఇంటర్నెట్ ను ఉపయోగించి ఇంటి నుంచే నిర్వహించుకోవచ్చు. షాపింగ్, బ్యాంకు లావాదేవీలు, ఇంట్లోకి కిరాణా సరకులు, టిక్కెట్ల బుక్కింగ్. ఇలా ప్రతిదీ చిటికెలో జరిగిపోతోంది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల కూడా రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్ సైట్లతో మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ రకాల ఆఫర్ల పేరుతో డబ్బులు గుంజుతున్నారు. మన బ్యాంకు ఖాతాల వివరాలను చోరీ చేసి, డబ్బులు లాగేస్తున్నారు. ఇలాంటి మోసాల నుంచి కొత్తగా వచ్చిన బీమా సాచెట్ల ద్వారా రక్షణ లభిస్తుంది.
సైబర్ మోసం అంటే..
ప్రముఖ కంపెనీల ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు నటిస్తారు. లేకపోతే బ్యాంకు అధికారులమని చెబుతారు. మన బ్యాంకు, ఆధార్ కార్డుల వివరాలు అడుగుతారు. అలాగే నకిలీ వీడియోలు, వాయిస్ క్లోన్‌లు, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా సంభాషణ సాగిస్తారు. సైబర్ నేరగాళ్లు ఏఐ సహాయంతో చిత్రాలు, వీడియోలను రూపొందించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అనేక మంది వీరి బారిన పడి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో బీమా కంపెనీలు తీసుకువచ్చిన సాచెట్ లపై అందరికీ ఆసక్తి పెరిగింది. వచ్చే ఐదేళ్లలో దేశంలో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ 27 నుంచి 30 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా, ఏఐ ఆధారిత మోసానికి బీమా కవరేజీని కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటాయి.
లేటెస్ట్ టెక్నాలజీ..
గతంలో సైబర్ నేరాలు తక్కువ స్థాయిలోనే ఉండేవి. ఎస్ఎంఎస్ ఫిషింగ్, మోసపూరిత కాల్స్, ఓటీపీ దొంగతనాలు మాత్రమే జరిగేవి. వీటిపై ప్రజలకు అవగాహన పెరగడంతో అప్రమత్తంగా వ్యవహరించేవారు. అలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండేవారు. దీంతో సైబర్ నేరగాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని మోసాల కోసం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జెన్ ఏఐతో ఆర్థిక నష్టాల తీవ్రత బాగా పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..