సిబిల్ స్కోర్‌తో పనిలేకుండా లోన్ పొందే అవకాశం.. అతి తక్కువ వడ్డీ.. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు..
Loan on FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు రుణాలు ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అనుకూలమైన మార్గంగా నిలుస్తాయి. ఇతర రకాల రుణాల మాదిరిగా కాకుండా, మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తం నుంచి కొంత నగదును సులభంగా రుణాన్ని పొందవచ్చు.

ఇటీవల కాలంలో అందరూ అవసరాలను తీర్చుకునేందుకు లోన్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఇల్లు కట్టుకోవాలనికొంటున్నా లేదా కొనుగోలు చేయాలనుకొనే వారు హోమ లోన్, కారు కొనుగోలు చేయాలనుకొనే వారు కార్ లోన్, ఇతర వ్యక్తిగత అవసరాలకు పర్సనల్ లోన్లు విరివిగా తీసుకుంటున్నారు. అయితే ఇటువంటి లోన్లు మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. బ్యాంకర్లు ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే లోన్లు మంజూరు చేస్తాయి. వడ్డీ రేటు అధిక సిబిల్ స్కోర్ ఉంటే తక్కువగా ఉంటుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగా తక్కువగా ఉంటే మాత్రం ఎటువంటి లోన్లు మంజూరు కావు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడతారు. అయితే దీనికో సొల్యూషన్ ఉంది. ఎటువంటి సిబిల్ స్కోర్ తో నిమిత్తం లేకుండా మీకు లోన్లు మంజూరు అవుతాయి. అది కూడా మార్కెట్లో అతి తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లోన్లు..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు రుణాలు ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి అనుకూలమైన మార్గంగా నిలుస్తాయి. ఇతర రకాల రుణాల మాదిరిగా కాకుండా, మీరు మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తం నుంచి కొంత నగదును సులభంగా రుణాన్ని పొందవచ్చు. ఈ లోన్లో మార్కెట్లోని ఇతర లోన్లతో పోలిస్తే తక్కువ వడ్డీ రేటుకు లభిస్తుంది. అలాగే మరేఇతర డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇబ్బంది లేకుండా లోన్లు..
మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై రుణం పొందడం అనేది ఇబ్బంది లేని ప్రక్రియ. దీనిలో మీరు క్రెడిట్ కార్డ్ చరిత్ర గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లోన్ ప్రాసెసింగ్ వేగంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందుతోంది. రిటైల్ కస్టమర్లకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై క్రెడిట్ సాధారణంగా మూడు విధాలుగా అందుబాటులో ఉంటుంది. అంగీకరించిన కాలపరిమితి లేదా మెచ్యూరిటీకి ముందు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు.
ఎంత మొత్తం లోన్ ఇస్తారంటే..
ఈ పద్ధతిలో మీరు ఎంత మొత్తం లోన్ తీసుకోవచ్చు అనే విషయం ఆ బ్యాంకు పాలసీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం రూపంలో ఈ అవకాశం ఉంటుంది. రుణపరిమితి సాధారణంగా డిపాజిట్ మొత్తంలో 70-95% మధ్య ఉంటుంది, అయితే కొన్ని బ్యాంకులు మరింత ఆఫర్ చేయవచ్చు. అయితే మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని రుణంగా తీసుకోలేరని మాత్రం గుర్తించాలి.
చాలా తక్కువ వడ్డీ..
వ్యక్తిగత రుణాలతో పోలిస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీ రేటు కంటే 50-200 బేసిస్ పాయింట్లు అధికంగా వడ్డీ రేటును వసూలు చేస్తాయి. అటువంటి రుణాలపై వడ్డీ రేట్లు 5% నుంచి 8% వరకు ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకా ఈ లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులు వెనుకాడవు. ఎందుకంటే బ్యాంకర్లు ఇచ్చే మొత్తానికి మీరు డిపాజిట్ చేసిన మొత్తమే ష్యూరిటీగా ఉంటుంది. అలాగే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండవు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







