EPFO News: పీఎఫ్ వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం.. ఎప్పుడు జమవుతుందో తెలుసా? ఇప్పుడే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి..
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకం కోసం 8.15 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. 2022-23 సంవత్సరానికి ఈపీఎఫ్ స్కీమ్‌లోని ప్రతి సభ్యుడు సంవత్సరానికి 8.15 శాతం వడ్డీని అందుకుంటారని నిర్ధారిస్తుంది.
ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. అయితే దానిలోకి మన శాలరీ నుంచి ఎంత మొత్తం కట్ అవుతుంది? దానిపై వచ్చే వడ్డీ ఎంత? ఆ వడ్డీ ఎలా లెక్కిస్తారు? ఎప్పుడు ఖాతాలో జమవుతుంది వంటి అంశాలు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడో ఆరు నెలలకో, సంవత్సరానికో ఓ సారి పాస్ బుక్ చెక్ చేసుకుంటారు. అయితే ఇటీవల కేంద్రం ఈపీఎఫ్ పై వడ్డీ రేటును ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద 8.15 శాతం వడ్డీని ఖాతాదారులకు అందించేందుకు ఆమోదం తెలిపింది . ఇటీవల జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం, ఈపీఎఫ్ఓ 2022-23 కోసం 8.15 శాతం వడ్డీని సభ్యుల ఖాతాల్లోకి జమ చేయాలని ఆయా కార్యాలయాలకు ఆదేశించింది. అయితే ఈ మొత్తం ఖాతాల్లో ఎప్పుడు జమవుతుంది? బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి తెలుసుకుందాం రండి..
కేంద్ర కార్మిక శాఖ ఉత్తర్వులు ఇలా..
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పథకం కోసం 8.15 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. 2022-23 సంవత్సరానికి ఈపీఎఫ్ స్కీమ్‌లోని ప్రతి సభ్యుడు సంవత్సరానికి 8.15 శాతం వడ్డీని అందుకుంటారని నిర్ధారిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్‌లో తెలియజేస్తుంది. ఆ తర్వాత చందాదారుల ఖాతాల్లోకి వడ్డీని జమచేస్తారు. నెలవారీ సభ్యుల నుంచి తీసుకున్న మొత్తంపై వడ్డీని లెక్కిస్తారు.
వడ్డీ రేటు ఇలా లెక్కిస్తారు..
ఈఫీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటు నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. అయితే, అవి ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేయబడతాయి. బదిలీ చేయబడిన వడ్డీ తదుపరి నెల బ్యాలెన్స్‌కి జోడించబడుతుంది. ఆ వడ్డీతో కలిపి నెల బ్యాలెన్స్ మొత్తంపై మళ్లీ వడ్డీని లెక్కిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులో, సంవత్సరానికి సంబంధించిన మొత్తం వడ్డీని జమ చేస్తారు.
పీఎఫ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి..
మీ పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోడానికి అధికారిక వెబ్‌సైట్, మెసేజ్, మిస్డ్ కాల్‌లు లేదా ఉమంగ్ యాప్‌తో సహా వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సులభంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు.
పాస్ బుక్ డౌన్ లోడ్ ఇలా..
- మీ పీఎఫ్ పాస్‌బుక్‌ని చూసుకోవడానికి సభ్యుడు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్ – epfindia.gov.inని సందర్శించాలి.
- డాష్‌బోర్డ్ ఎగువన పేర్కొన్న ‘సర్వీసెస్’ విభాగంపై క్లిక్ చేయండి.
- ఈ విభాగం కింద, ‘ఫర్ ఎంప్లాయీస్’ ఎంపికపై క్లిక్ చేయండి.
- ఒక కొత్త పేజీ తెరవబడుతుంది. ‘సర్వీసెస్’ కింద పేర్కొన్న ‘మెంబర్ పాస్‌బుక్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ‘మెంబర్ పాస్‌బుక్’ని ఎంచుకున్న తర్వాత, లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
- మీ ఖాతాకు సంబంధించిన యూఏఎన్ నంబర్ తో పాటు పాస్ వర్డ్, క్యాప్చాను ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి. అంతే మీ పీఎఫ్ ఖాతాకు సంబంధించిన చెల్లింపులు, క్లయిమ్స్, బ్యాలెన్స్ తో కూడిన మొత్తం ప్రోఫార్మా మీకు కనిపిస్తుంది. దీనిని అవసరం అయితే పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మెసేజ్ ద్వారా బ్యాలెన్స్..
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకునే మరో పద్ధతి మెసేజ్‌ల ద్వారా. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899కి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా సులభంగా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఎస్ఎంఎస్ పంపే ఫార్మాట్ ఇలా ఉంటుంది: ‘EPFOHO UAN ENG’. అలాగే 011-22901406 లేదా 9966044425కు మిస్డ్ కాల్ పంపడం ద్వారా బ్యాలెన్స్ ను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..