AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PhonePe New Feature: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ పే నుంచి అన్ని చేసేయొచ్చు..

పన్ను చెల్లింపులు కూడా యాప్ ద్వారా చేసుకొనే వెసులుబాటును కల్పించింది. వ్యక్తిగత పన్నులైనా, లేదా బిజినెస్ కు సంబంధించిన చెల్లింపులైనా డైరెక్ట్ గా ఫోన్ పే ద్వారా చెల్లించే విధంగా కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

PhonePe New Feature: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్ పే నుంచి అన్ని చేసేయొచ్చు..
Phonepe
Madhu
|

Updated on: Jul 27, 2023 | 5:30 PM

Share

బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. డిజిటల్ బాటలో దూసుకుపోతోంది. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యాప్ ల రాకతో ఆర్థిక లావాదేవీల స్వరూపమే మారిపోయింది. చిన్న చిన్న వీధి వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకూ అన్నింటా ఈ యాప్ పేమెంట్స్ ఎక్కువగా సాగుతున్నాయి. ఇ దే క్రమంలో ఫోన్ పే మరో ముందడుగు వేసింది. అదేంటంటే పన్ను చెల్లింపులు కూడా యాప్ ద్వారా చేసుకొనే వెసులుబాటును కల్పించింది. వ్యక్తిగత పన్నులైనా, లేదా బిజినెస్ కు సంబంధించిన చెల్లింపులైనా డైరెక్ట్ గా ఫోన్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. దీని కోసం ఇన్ కమ్ ట్యాక్స్ పేమెంట్ అనే ఫీచర్ ఫోన్ పే యాప్ లో జోడించింది. దీంతో పన్ను చెల్లింపు పని చాలా సులువుగా పూర్తియిపోయింది.

ఫోన్ పే ఏం చెబుతోందంటే..

ఈ సందర్భంగా ఫోన్ పే బిల్ పేమెంట్స్ అండ్ రిచార్జ్ బిజినెస్ హెడ్ నిహారికా సైగల్ మాట్లాడుతూ ఫోన్‌పేలో వినియోగదారుల అవసరాలను తీర్చడానికి యాప్ లో కొత్త ఫీచర్లు, ఆఫర్లను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే ఫోన్ పే యాప్ లో నే ఆదాయపు పన్నులు చెల్లించే సౌలభ్యం కల్పించామన్నారు. వాస్తవానికి పన్నులు చెల్లించడం అనేది చాలా క్లిష్టమైన, సమయం తీసుకునే పని. ఇప్పుడు ఫోన్ పే దీనిని సులభతరం చేసేసిందని ఆమె వివరించారు.

ఫీచర్ ని ఎలా ఉపయోగించాలంటే..

  • ఫోన్ పే యాప్ ను ఓపెన్ణ చేయండి.
  • దానిలో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ట్యాక్సెస్ సెక్షన్ లోకి వెళ్లండి.
  • దానిలో ఇన్ కమ్ ట్యాక్స్ ను ఎంపిక చేసుకోండి.
  • పాన్ వివరాలు, ట్యాక్స్ కు సంబంధించిన అన్ని పత్రాలు సిద్ధంగా పెట్టుకోండి.
  • పన్ను చెల్లింపు రకం, అసెస్‌మెంట్ సంవత్సరం, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంచుకోండి.
  • పన్ను మొత్తాన్ని నమోదు చేసి పేమెంట్ పూర్తి చేయండి. చెల్లించిన పన్నులు 2 రోజుల్లో సంబంధిత విభాగానికి చెల్లించబడతాయి.

క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా కూడా..

ఫోన్ పే వినియోగదారులు ఆదాయ పన్నులను క్రెడిట్ కార్డు లేదా యూపీఐల ద్వారా కూడా చెల్లించే వెసులుబాటు కల్పించింది. క్రెడిట్ కార్డుపై చెల్లిస్తే 45-రోజుల వడ్డీ రహిత కాలంతో పాటు వినియోగదారు బ్యాంకు ఆధారంగా పన్ను చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లను సంపాదించే అవకాశం ఉన్నందున, ఈ ఫంక్షన్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు అదనపు ప్రయోజనాలను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది గమనించాలి..

ఈ కొత్త ఫోన్ పే ఫీచర్‌ని ఉపయోగించి, పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను మాత్రమే చెల్లించగలరని గమనించాలి. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరని గుర్తించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..