Electric Bicycle: తక్కువ ధరలోనే లగ్జరీ ఈ-బైక్.. ఎంచక్కా మడతపెట్టేసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవి..
దేశీయ ఎలక్ట్రిక్ బైస్కిల్ కంపెనీ అయిన స్విచ్ బైక్ లగ్జరీ ఎలక్ట్రిక్ సైకిల్ ని ఇటీవల లాంచ్ చేసింది. దీని పేరు స్విచ్ బైక్ లైట్ ఎక్స్ఈ(svitch bike LITE XE). దీని ప్రత్యేకత ఎంటంటే ఈ బైక్ ని ఎంచక్కా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మడతపెట్టేసుకొని, ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకెళ్లిపోవచ్చు.

విద్యుత్ శ్రేణి వాహనాలలో సరికొత్త మోడళ్లు మార్కెట్లో క్యూ కడుతున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యద్భుత ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. అందులో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలతో పాటు దేశీయ సంస్థలకు చెందిన వాహనాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా కార్లు, బైక్లు, స్కూటర్లు ఈ విద్యుత్ శ్రేణిలో మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ బైస్కిల్ కంపెనీ అయిన స్విచ్ బైక్ లగ్జరీ ఎలక్ట్రిక్ సైకిల్ ని ఇటీవల లాంచ్ చేసింది. దీని పేరు స్విచ్ బైక్ లైట్ ఎక్స్ఈ(svitch bike LITE XE). దీని ప్రత్యేకత ఎంటంటే ఈ బైక్ ని ఎంచక్కా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మడతపెట్టేసుకొని, ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకెళ్లిపోవచ్చు. దీనిలో బ్యాటరీ ప్యాక్ సింగిల్ చార్జ్ పై దాదాపు 80 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
డిజైన్ ఇలా.. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కి అడ్జస్టబుల్ హ్యాండిల్ బార్, సీట్ బార్, సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. దీనిని ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేసే అల్యూమినియ్ 6061 ఫ్రేమ్ లైట్ వెయిట్ మెటీరియల్ తో తయారు చేశారు.
సామర్థ్యం.. ఈ ఎలక్ట్రిక్ బైస్కిల్ 36V, 250W సామర్థ్యం కలిగిన స్విచ్ మోటర్ ఉంటుంది. సెవెన్ స్పీడ్ షిమానో గేర్స్, ఎల్సీడీ డిజిటల్ డిస్ ప్లే, 5 పెడల్ అసిస్ట్ సిస్టమ్ మోడ్స్, టెయిల్ లైట్ ఇండికేటర్స్ ఉంటాయి. దీనిలోని బ్యాటరీ ప్యాక్ 36V, 10.4AH సామర్థ్యంతో ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 80 కిలోమీటర్ల వరకూ వెళ్తుంది.



ధర, లభ్యత.. స్విచ్ బైక్ లైట్ ఎక్స్ఈ బైక్ ధర రూ. 74,999గా ఉంది. ఇది స్కార్లెట్ రెడ్, మిడ్ నైట్ సప్పైర్, యాంకీ ఎల్లో, గోబ్లిన్ గ్రీన్, బెర్లీన్ గ్రే కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. కంపెనీ ఆఫీషియల్ వెబ్ సైట్లో బుకింగ్స్ కూడా ప్రారంభించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..