LIC Jeevan shanti Policy: నెలకు రూ. లక్ష పింఛన్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. రిటైర్‌మెంట్ తర్వాత ఫుల్ సెక్యూరిటీ.
ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. పెద్ద మొత్తంలో పెన్షన్ రూపంలో కావాలి అనుకొనే వారికి బెస్ట్ చాయిస్. ఈ పథకం కింద మీరు పెట్టిన పెట్టుబడి ఆధారంగా నెలకు రూ. లక్ష కన్నా అధిక మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందవచ్చు.
మీ వృద్ధాప్యంలో సెక్యూరిటీ లేదా నిర్ధిష్ట ఆదాయం ఉండాలని అనుకుంటే.. ఇది మీ కోసమే. వృద్ధాప్యంలో లేదా రిటైర్మెంట్ తరువాత భవిష్యత్ కోసం ఆలోచించేవారికి ఎల్ఐసీ అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యపు ఖర్చుల్ని సులభంగా అధిగమించవచ్చు. ఈ పాలసీలో మీరు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు..జీవితాంతం గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. ఇంతకీ ఎంటా పథకమని ఆలోచిస్తున్నారా? ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. పెద్ద మొత్తంలో పెన్షన్ రూపంలో కావాలి అనుకొనే వారికి బెస్ట్ చాయిస్. ఈ పథకం కింద మీరు పెట్టిన పెట్టుబడి ఆధారంగా నెలకు రూ. లక్ష కన్నా అధిక మొత్తాన్ని పెన్షన్ రూపంలో పొందవచ్చు. ఇటీవల ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాన్యుటీ రేట్లను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు పాలసీదారులకు వారి ప్రీమియంలకు ఎక్కువ పెన్షన్ లభిస్తుంది.
ఉద్యోగస్తులకు మేలు..
ఉద్యోగస్థులకు తరచూ ఎదురయ్యే ప్రశ్న.. రిటైర్మెంట్ తరువాత పరిస్థితి ఏంటని. అందుకే ఎల్ఐసీ ఈ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో పెట్టుబడి మీకు జీవితాంతం పెన్షన్ వస్తుంది. నెలవారీ, అర్ధ-సంవత్సరం, వార్షిక లేదా త్రైమాసిక సాధారణ ఆదాయం కోరుకునే వారి కోసం ఈ పథకాన్ని అందిస్తోంది. ముందస్తు పదవీ విరమణ కోరుకునే వారు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. పాలసీదారులు ఒకే ప్రీమియంతో తమ లక్ష్యాలను సాధించవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. మీరు కోరుకున్న నెలవారీ ఆదాయం ఆధారంగా మీకు ప్రీమియం చెల్లించవచ్చు.
నెలకు రూ. లక్ష కావాలంటే..
నెలవారీ రూ.లక్ష పెన్షన్ కావాలంటే 12 ఏళ్లకు రూ.కోటి పెట్టుబడి పెట్టాలి. 12 ఏళ్ల తర్వాత నెలకు రూ.1.06 లక్షల జీతం లభిస్తుంది. మీరు కేవలం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటే, మెచ్యూరిటీ తర్వాత పెన్షన్‌గా మీకు నెలకు రూ.94,840 పెన్షన్ లభిస్తుంది. మీకు నెలవారీ పెన్షన్ రూ. 50,000 మాత్రమే చాలా అని మీరు అనుకుంటే, మీరు కేవలం రూ. 50 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. 12 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.53,460 జీతం లభిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..