AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Jeevan Labh: ఎల్ఐసీ నుంచి అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 256తో ఏకంగా రూ. 54లక్షలు సంపాదించే అవకాశం..

ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ లో ఇన్సూరెన్స్‌తో పాటే సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. దీనిలో రోజుకు రూ. 256 లెక్కన నెలకు రూ. 7,960 చొప్పున కడితే.. మెచ్యూరిటీ సమయానికి చేతికి రూ.54 లక్షలు అందుతాయి.

LIC Jeevan Labh: ఎల్ఐసీ నుంచి అద్భుతమైన స్కీమ్.. రోజుకు రూ. 256తో ఏకంగా రూ. 54లక్షలు సంపాదించే అవకాశం..
Lic Policy
Madhu
|

Updated on: Jun 03, 2023 | 7:30 AM

Share

ప్రతి వ్యక్తి జీవితంలో పొదుపు చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలను తీర్చడంలో ఈ పొదుపు సాయపడుతుంది. మనకై మనం పొదుపు చేయాలంటే కష్టం. పైగా ఎంత పొదుపు చేసిన దానిపై రాబడి రాదు. అదే మంచి స్కీమ్ లలో పెట్టుబడి పెడితే సొమ్ము భద్రంగా ఉండటంతో పాటు మెచ్యూరిటీ సమయానికి మంచి రాబడులు కూడా వస్తాయి. అందుకే సురక్షితమైన పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అటువంటి సురక్షితమైన పథకాలను అందించే సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ). దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అద్భుత పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఎల్ఐసీ అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా పథకాలను రూపొందిస్తుంది. ఇందులో ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. ఇది ఎండోమెంట్ పాలసీ. ఈ పాలసీతో పాలసీదారులు బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను పొందుతారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ..

ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ లో ఇన్సూరెన్స్‌తో పాటే సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. దీనిలో రోజుకు రూ. 256 లెక్కన నెలకు రూ. 7,960 చొప్పున కడితే.. మెచ్యూరిటీ సమయానికి చేతికి రూ.54 లక్షలు అందుతాయి. ఇక పాలసీ హోల్డర్ ఒకవేళ చనిపోతే.. ఆ క్లిష్ట సమయాల్లో ఇది ఆ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతుంది. ఇక పాలసీ మొత్తం కడితే మెచ్యూరిటీకి పెద్ద మొత్తంలో నగదు అందుతుంది.

అర్హత ఇది.. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయసు 18 ఉంటే సరిపోతుంది. 59 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో వేర్వేరు మొత్తాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా ఇందులో చేరొచ్చు. అయితే ముందుగానే చేరితే ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి.. రూ.25 లక్షల పాలసీని ఎంచుకున్నట్లయితే.. ఇందులో ఇన్వెస్టర్ 16 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ 25 సంవత్సరాలు. అంటే పాలసీ ప్రారంభించిన 25 ఏళ్లకు మొత్తం నగదు చేతికి వస్తుంది. ఇక్కడ మెచ్యూరిటీ సమయానికి చేతికి ఏకంగా రూ.54 లక్షలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

అడిషనల్ బోనస్ కూడా..

అంటే ఈ ప్రీమియం ప్లాన్‌లో భాగంగా నెలకు రూ.7960 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జీఎస్టీ కూడా వర్తిస్తుంది. మొత్తం 25 సంవత్సరాల వ్యవధిలో ఇన్వెస్టర్ రూ.14,67,118 వరకు కట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయానికి దీనిని 3 రెట్లకు పైనే అంటే రూ.54 లక్షల వరకు వస్తుంది. ఫైనల్ అడిషనల్ బోనస్‌గా మరో రూ. 9 లక్షలు వస్తాయి. వీటితో పాటు 10, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ఇలా వేర్వేరు టెన్యూర్స్ కూడా ఉంటాయి. పాలసీ టర్మ్ ముగియక ముందే పాలసీదారుడు చనిపోతే గనుక నామినీకి ఈ బెనిఫిట్స్ దక్కుతాయి. ఇక్కడ కూడా నగదు మొత్తం, బోనస్ తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..